మిల్కీ బ్యూటీ…తమన్నా పాపం చాలా ఫీల్ అవుతుందట…ఎందుకు “నెక్స్ట్-ఏంటి” సినిమా ఫ్లాప్ అయినందుకా? అంటే అవునట. అదేంటి ఆమెకు ఏమైనా ఫ్లాప్స్ కొత్తా అంటే..అలా అని కాదు..ఒక అర్జున్ రెడ్డి, ఒక ఆర్ఎక్స్ 100 లాంటి ‘ఏ’ సర్టిఫికేట్ సినిమా తర్వాత అదే రేంజ్ బోల్డ్ కధగా వచ్చిన “నెక్స్ట్-ఏంటి” సినిమా భారీ హిట్ అందుకుంటుంది అని, అయితే తాను అంతగా తెగించి అలాంటి సీన్స్ కి ఓకే చెప్పినా, మరో పక్క సెక్స్ గురించి కధలు వల్లించినా పెద్దగా ఎఫెక్ట్ ఏమీ లేదు…
[m9ad]
మరో పక్క తెలంగాణా ఎన్నికల సమయంలో రిలీజ్ అవ్వడంతో ఆ సినిమా గురించి పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ఆ తర్వాత అయినా సినిమా పుంజుకుంటుంది ఏమో అని అనుకున్నప్పటికీ సినిమా తుస్సుమంది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయిందని తమన్నా ఎంత ఫీల్ అవుతుంది ఆమె ఫాన్స్ కూడా ఆమెపై అదే రకంగా జాలి చూపిస్తున్నారట.
అయినా ఆమెపై జాలి చూపించడం ఎందుకు?…ఆమె చేతుల్లో ఆఫర్స్ లేకపోతే ఆమెపై జాలి చూపించాలి కానీ, వరుసగా ఆరు సినిమాలు ఆమె చేతుల్లో ఉన్నాయి. అందులో సైరా మొదలుకుని, ఎఫ్-2, దట్ ఈజ్ మహా లక్ష్మి, అభినేత్రి-2 మరో రెండు సినిమాలు క్యూలో ఉన్నాయి. మరి సినిమాలు ఏమీ లేకపోతే ఆమెపై జాలి చూపించాలి కానీ, వరుస సినిమాలు ఉంటే ఇంకెందుకు ఫీల్ అవడం…ఎంతైనా అందాల ఆరబోతను నమ్ముకున్న హీరోయిన్ కదా…పెద్ద డోకా ఏమీ ఉండదులే!



