తమిళ సినీప్రియులు ఎంతగా ఆరాధిస్తారో, ఏదైనా విషయం వస్తే అంతే స్థాయిలో చీల్చి చెండాడతారు కూడా! దానికి తాజా ఉదాహరణే శింబు – అనిరుద్ ఉదంతం. యూట్యూబ్ లో లీకైన ‘బీప్ సాంగ్’తో శింబు – అనిరుద్ లపై ‘ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్’ (ఏఐడబ్ల్యుడిఏ) కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వీరిద్దరి కోసం పోలీస్ వర్గాలు కూడా వేచిచూస్తున్నాయి. ఏ సమయంలోనైనా అదుపులోకి తీసుకోవచ్చని ప్రచారం జోరందుకుంది.
మరో వైపు వీరిద్దరిపై తమిళనాట వ్యాప్తంగా నిరసనలు జోరందుకున్నాయి. ఇరువురి ఫ్లెక్సీలకు చెప్పుల దండలు వేసి మహిళలు, చిన్నారులు నిరసన తెలిపారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ‘ఫోటో’ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తమిళనాట ఏదైనా కాస్త ఎక్కువే అనడానికి ఇదొక నిదర్శనగా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు.
ADVERTISEMENT
ADVERTISEMENT





