తమిళ హీరోకు సర్ ప్రైజ్ ఇచ్చిన తెలుగు హీరోయిన్!

Tamil Hero Jai - Anjali affair Buzz‘జర్నీ’ సినిమాతో ‘హిట్ పెయిర్’గా మారిన తమిళ హీరో ‘జై,’ తెలుగు హీరోయిన్ ‘అంజలి’ల మధ్య ‘సంథింగ్ సంథింగ్’ అన్న విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. అయితే దీనికి వారిద్దరూ ప్రస్తుతానికి ‘స్నేహం’ అనే పేరు పెట్టగా, ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ‘ప్రేమ’ అని పిలుస్తోంది. దీనికి ఇటీవల జరిగిన చాలా సంకేతాలనే కారణాలుగా చూపుతున్నారు ట్రేడ్ వర్గీయులు.

ఇటీవల తమిళ స్టార్ సూర్య ఇచ్చిన ‘దోస ఛాలెంజ్’ను స్వీకరించిన ఈ జంట, జై దోశ వేసి అంజలితో తినిపించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. సూర్య విసిరిన ఈ ‘దోస ఛాలెంజ్’ కపుల్ కు కాగా, తాము కాబోయే కపుల్ అన్న సంకేతాలను ఈ దోస ఛాలెంజ్ తో నిరూపించారు. ఈ ఉదంతం అనంతరం జై పుట్టిన రోజు సందర్భంగా అంజలి ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చిందట.

ADVERTISEMENT

‘బెలూన్’ సినిమా షూటింగ్ లో ఉన్న జై దగ్గరకు అంజలి కేక్ తో వెళ్లింది. ఆ చిత్ర యూనిట్ మధ్య జైతో కేక్ కట్ చేయించి, తినిపించిందట, అంతేకాదు ఆ రోజంతా వారిద్దరూ కలిసే ఉన్నారని, అచ్చం భార్యాభర్తల్లాగే ఉన్నారని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ ఇద్దరి వివాహానికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయని, బహుశా త్వరలోనే ఈ శుభవార్త వినిపించినా ఆశ్చర్యం లేదని ఓ పక్కన హల్చల్ చేస్తుండగా, తామిద్దరం మంచి స్నేహితులమని ఈ జంట చెప్తోంది.

ADVERTISEMENT
Latest Stories