మరో యువనటి ఆత్మహత్య!

tamil-tv-serial-actress-priyanka-commits-suicideతమిళ టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన యువనటిమణి ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడింది. ‘వంశం’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ప్రియాంకా, ఈ ఉదయం వలసరవాక్కంలోని తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించింది. ఈ ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చేసరికి తన గదిలో ఆమె ఆత్మహత్య చేసుకుని కనిపించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. గత కొంతకాలంగా ఆమె తన భర్తకు దూరంగా ఉంటోందని, కుటుంబ విభేదాలే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా నటిమణుల ఆత్మహత్యల సంఖ్యలు ఎక్కువవుతుండడం గమనించదగ్గ విషయం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories