వైరల్ – డిగ్రీలో ‘హెచ్ఈసీ’ చదివిన వైసీపీ నేత!

Tammineni Seetharam YSRCP MLA HEC Degree Groupవైసీపీలో ప్రజాప్రతినిధులుగా ఉన్న వారంతా “స్పెషల్” చదువులు చదువుకున్నారో ఏమో గానీ, ఇటీవల ఇస్తోన్న పలు ఇంటర్వ్యూలలో వారి విద్య భాగోతం బట్టబయలు అవుతోంది. వైసీపీ నుండి టిడిపిలోకి వచ్చిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ‘బికాంలో ఫిజిక్స్’ అన్న వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఆడుకున్న వైనం బహుశా ఎప్పటికి మరిచిపోలేరేమో! దీంతో ఒక్కసారిగా జలీల్ ఖాన్ పాపులారిటీ పెరిగిందిలేండి!

ఇదే బాటలో తాను కూడా పాపులారిటీ కావాలనుకున్నారో లేక నిజంగానే అలా “స్పెషల్” చదువులు చదువుకున్నారో ఏమో గానీ, తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ చేసాడు. తాను ఇంటర్మీడియట్ లో ‘సిఈసి’ చదువుకున్నానని చెప్తూ… దానిని విడమర్చి మరీ చెప్పిన తమ్మినేని సీతారాం, డిగ్రీలో మాత్రం ‘హెచ్ఈసీ’ చదువుకున్నానని చెప్పడంతో, సదరు యాంకర్ దిమ్మతిరిగింది. ‘హెచ్ఈసీ’ అనే గ్రూప్ ఇంటర్మీడియట్ లో కదా ఉండేది అని సదరు యాంకర్ చెప్పడంతో తమ్మినేని అవాక్కయ్యారు.

ADVERTISEMENT

విశేషం ఏమిటంటే… ‘బికాంలో ఫిజిక్స్’ అంటూ జలీల్ ఖాన్ ఎవరికైతే జవాబు చెప్పారో, అదే యాంకర్ కు తమ్మినేని సీతారాం ‘డిగ్రీలో హెచ్ఈసీ’ అంటూ బదులిచ్చారు. దీంతో సోషల్ మీడియా జనులకు మంచి ఆహారం లభించినట్లయ్యింది. సదరు వీడియోను షేర్ చేస్తూ ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యేల చదువులతో బహుశా సదరు యాంకర్ చదువు ఉంటుందో, ఉడుతుందో అన్న కామెంట్స్ కూడా వ్యక్తమవుతున్నాయిలేండి!

ADVERTISEMENT
Latest Stories