వైసీపీ లో ఇంకెంతమంది ‘మంచివారు – సౌమ్యులు’ ఉన్నారో.?

Tammineni Sitaram and Sidiri Appala Raju

వైసీపీ పార్టీలో ఉన్న నేతలంతా అయితే సౌమ్యులు, లేదంటే మంచివారు అంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ 2024 ఎన్నికలకు గాను తన పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసారు.

మంచివారు, సౌమ్యులుగా ప్రజల ముందుకొచ్చిన ఆ నేతలు ఇప్పుడు వారిలో ఉన్న అసలైన మంచితనాన్ని, నిజమైన సౌమ్యతను బయటపెడుతున్నారు. అందుకు వల్లభనేని వంశీ నుంచి మొదలుపెడితే జోగి రమేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అంబటి రాంబాబు, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి….ఇలా వైసీపీ లో జగన్ చెప్పిన మంచివారి లిస్ట్ చాలానే ఉంది.

ADVERTISEMENT

రాజకీయాలకు సంబంధం లేని మహిళలను చట్ట సభల సాక్షిగా అవమానించేంత మంచివాడు, అందగాడు వల్లభనేని వంశీ, ఇక నకిలీ మద్యం మాఫియాతో అడ్డంగా పోలీసులకు దొరికిపోయినంత సౌమ్యుడు జోగి రమేష్, వేల కోట్ల అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కుంటున్న మరికొంతమంది మంచివాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి.

ఇక ఏకంగా రాష్ట్ర సీఎం నే నడిరోడ్డు మీద లకరాలతో దూషించేంత సౌమ్యుడు అంబటి రాంబాబు కాగా సొంత బాబాయ్ వివేకా దారుణ గొడ్డలి వేటు ఆరోపణలు మోస్తున్న మంచివాడు అవినాష్ రెడ్డి…ఇలా జగన్ మెచ్చిన, వైసీపీ నమ్మిన మంచివారు, సౌమ్యులకు వీరంతా నిలువెత్తు నిదర్శనాలు గా నిలుస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, సిదిరి కూడా చోటు సంపాధించుకున్నారు. తమ్మినేని గారి మంచితనం భూకబ్జాలకు పరిమితం అయ్యింది. చింతామణి గ్రామంలో 23 ఎకరాల భూకబ్జా తో పాటుగా స్థానిక టీఎస్ఆర్ కాలేజీ పక్కన ఉన్న 8 సెంట్లు, ఓ దివంగత పోలీస్ కానిస్టేబుల్ ఇల్లు ఇలా తమ్మినేని ఖాతాలో ఉన్న మంచితనం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇక సిదిరి అప్పలరాజు ఉదంతం ఇటీవల వెలుగు చూసింది. 18 ఏళ్ళ సిదిరి కుమారుడు చేసిన బైక్ యాక్సిడెంట్ తో ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. అయితే తన తనయుడు చేసిన ఈ తప్పును కప్పిపుచ్చుకునేందుకు సిదిరి చేసిన జిమ్మిక్కులే ఆయన సౌమ్యత్వానికి నిదర్శనాలు.

ఇలా వైసీపీ పార్టీ నుంచి దాదాపు ఏ నాయకుడి చరిత్ర చూసినా ఇటువంటి భాగోతాలే వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇవ్వని జగన్ చెప్పినట్టుగా మంచితనానికి, మానవత్వానికి, సౌమ్యత్వానికి నిదర్శనాలుగా ప్రజలు భావిస్తారా అంటే అందుకు వైసీపీ కి వచ్చిన 11 సీట్లే సాక్ష్యం అవుతుంది.

మరి వైసీపీ లో కూటమి ప్రభుత్వం తవ్వే కొద్దే బయటపడుతున్న ఈ మంచివారు, సౌమ్యుల లిస్టులో ఇంకెంతమంది తమ్మినేనిలు ఉంటారో, ఇంకెంతమంది సిదిరి అప్పలరాజులు బయటకొస్తారా.? చూడాలి..!

ADVERTISEMENT
Latest Stories