అస్సలు ఊహించలేదుగా…ఎలా కలసి వచ్చిందిలే!

Taxiwaala movie theaters 70 percent  occupancyరోబో-2.0 సినిమా రిలీజ్ అయ్యే మూడు రోజులు ముందే విజయ్ దేవరకొండ తన ‘ట్యాక్సీ వాలా’ దుకాణం మూసేస్తాడు అని అందరూ అనుకున్నారు. అయితే ట్రేడ్ కూడా అదే నమ్మింది. కానీ విచిత్రంగా ఇప్పటికీ ట్యాక్సీ వాలా జోరు పెద్దగా తగ్గకపోవడం విశేషంగా చెప్పవచ్చు.

[m9ad]

ADVERTISEMENT

అయితే రోబో సినిమాకి తొలి రోజు కాస్త మిక్స్డ్ టాక్ రావడంతో అక్కడ చాన్స్ కొట్టేసాడు మన ట్యాక్సీ వాలా. ఇప్పటికీ ట్యాక్సీ వాలా 70 పర్సెంట్ ఆకూపెన్సీతో రన్ అవుతుంది అంటే దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాల్సిందే. అయితే ముందు టాక్ కాస్త అటూ ఇటూగా వచ్చినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్న తలైవార్ 85 శాతం వరకు సీట్లను ఫిల్ చెయ్యగలుగుతున్నాడు. ఇక తలైవార్ సినిమా ఒకసారి చూసిన వారంతా వేరే సినిమా కోసం వెతికే క్రమంలో విజయ్ ట్యాక్సీ వాలా తప్పితే వేరే ఏం లేకపోవడంతో ఈ కుర్ర హీరోకి అలా కలసి వస్తుందిలే. ఇక గీతా గోవిందం లాగా 60+ కోట్ల భారీ వసూళ్లు రాబట్టలేకపోయినా, ముందే రిలీజ్ అయిపోయి నానా ఇబ్బందులు పడిన సినిమాగా భారీగానే బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టింది.

మొత్తంగా చూసుకుంటే పెట్టిన పెట్టుబడికి రెండింతల లాభాలతో నిర్మాతలు ఫుల్ కుషీలో ఉన్నారు అని చెప్పవచ్చు. మరి మెల్లగా సెకెండ్ గేర్ లో బండి లాగిస్తున్న మన రౌడీ సీఎం…లాంగ్ రన్ లో కలెక్షన్స్ విషయంలో ఎక్కడ బ్రేక్ వేస్తాడో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories