ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పైరసీపై విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. ఈ సినిమాను పైరసీ చేసిన వాళ్ళందరికీ ఈ నెల 17వ తేదీన నాతో పాటు ‘మిడిల్ ఫింగర్’ చూపించడానికి సిద్ధం కండి అంటూ చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ అయ్యాయి. అయితే నాడు విజయ్ దేవరకొండ ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసారో తాజాగా వెలుగుచూసింది.
[m9ad]
గత కొన్ని గంటలుగా ఈ సినిమా అన్ ఎడిటెడ్ వెర్షన్ యొక్క పైరసీ ప్రింట్ ఆన్ లైన్ లో అందుబాటులోకి రావడం నిజంగా కలవరానికి గురిచేసే అంశం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డబ్బింగ్ లేకుండా ఉన్నా… ఈ సినిమా స్టోరీ మొత్తం బయటకు వచ్చేస్తుంది గనుక, ఖచ్చితంగా ఇది “టాక్సీవాలా” సినిమాపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
అయితే ఈ లీక్ ను విజయ్ దేవరకొండ ముందే ఊహించారేమోనని ప్రీ రిలీజ్ ఈవెంట్ సంగతులు గుర్తు చేసుకుంటే అవగతం అవుతుంది. ఈ సినిమా ఎవరు, ఎలా చెప్పినా… 17వ తేదీన ధియేటర్లలో చూడండి… నాది గ్యారెంటీ అంటూ భరోసా ఇవ్వడం వెనుక ఆంతర్యం ఇదేనని విజయ్ దేవరకొండ అభిమానులు చెప్తున్న విషయం.
ఈ లీకేజ్ లో అసలు ట్విస్ట్ ఏమిటంటే… తాము ఎందుకు లీక్ చేసామో కూడా వివరణ ఇవ్వడం. నిజానికి ఈ ప్రింట్ తమ వద్దకు ఎప్పుడో వచ్చిందని, అయితే సినిమా రిలీజ్ తర్వాతనే దీనిని విడుదల చేద్దామని భావించామని, కానీ బలవంతంగా ఇప్పుడే విడుదల చేయడానికి కొన్ని కారణాలున్నాయి, తమను మన్నించాల్సిందిగా ‘టాక్సీవాలా’ యూనిట్ కు క్షమాపణలు చెప్తూ…. ఈ లీకేజ్ ను విడుదల చేసారు.



