“గీత గోవిందం”తో బ్లాక్ బస్టర్ ను… “నోటా”తో డిజాస్టర్ ను… చవిచూసిన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా మరో మూవీని లైన్ లో పెట్టేసారు. అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు “టాక్సీవాలా” సినిమా రాబోతుండడం విజయ్ దేవరకొండ అభిమానులకు సంతోషాన్ని పంచే విషయం.
నవంబర్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా స్వయంగా విజయ్ దేవరకొండనే ప్రకటించాడు. యంగ్ జనరేషన్ అంతా ఈ సినిమాకు పనిచేసారని చెప్పిన విజయ్, ఈ ఏడాదిలో మూడవ సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు. హిట్టయినా, ఫ్లాప్ అయినా… ఈ సారైనా చెప్పిన టైంకు రిలీజ్ చేస్తే చాలు అంటున్నారు ఈ క్రేజీ హీరో ఫ్యాన్స్!
ADVERTISEMENT
[m9adh]
ADVERTISEMENT



