“ఐయామ్ విత్ యు”..అదే ఆదరణ.!

Chandrababu Naidu

చంద్రబాబు విడుదలైన రాజమండ్రి మొదలుకొని ఇప్పుడు వస్తున్నా హైద్రాబాద్ వరకు బాబుకి రెండు రాష్ట్రాల నుండి ఊహించని ప్రజాధరణే ఎదురయ్యింది చెప్పాలి. ఈ సందర్భంలో బాబుని ఉద్దేశించి నారా భువనేశ్వరి చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుచేసుకోవాల్సిందే.

“ఎవరైనా జైలుకు వెళితే వారి అక్రమాలు బయటకొస్తాయి. కానీ చంద్రబాబు జైలుకెళ్తే మాత్రం ఆయన చేసిన అద్భుతాలు, కట్టిన నిర్మాణాలు బయటకొస్తున్నాయి”. ఇది చాలు చంద్రబాబు గురించి చెప్పడానికి అంటూ ఆమె గచ్చిబౌలి స్టేడియంలో ఐటీ ఉద్యోగులు నిర్వహించిన CBN ‘S గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ సమావేశాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.ఇప్పుడు చంద్రబాబుకి దక్కిన ప్రజాదరణ చూస్తుంటే ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏం సాధించారో సామాన్యులకే కాదు ప్రత్యర్థులకు కూడా ఇప్పుడే అర్ధమవుతుంది.

ADVERTISEMENT

రాజమండ్రి నుంచి విజయవాడకు 4 గంటల ప్రయాణం కాగా 14 గంటల సమయం పట్టింది అంటేనే ప్రజాదరణ ఏస్థాయిలో ఉందో ఊహించవచ్చు. బాబు అవినీతికి పాల్పడ్డాడు, ఆధారాలతో దొరిగిన దొంగ చంద్రబాబు అంటూ ప్రజలు మైండ్ లోకి ఎక్కించడానికి మేము చాలా కష్టపడాల్సి వస్తుంది అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల చెప్పినట్టు వీరు ప్రజలు మైండ్ లోకి ఎక్కించాలనుకున్నారు కానీ అది ఎక్కలేదని నిన్న బాబు రిలీజ్ తరువాత జరిగిన పరిణామాలతో ప్రభుత్వ పెద్దలకు కూడా తెలిసొచ్చినట్టుంది.

“క్రింద పడ్డా పై చెయ్యి మాదే” అన్న సామెత మాదిరి తమ పాచికలు పారలేదని తెలిసిన తమ ప్రయత్నాన్ని విరమించుకోవడం లేదు వైసీపీ నాయకులు.నిన్నటి సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయిన బాబు ఈ రోజు సాయంత్రం హైద్రాబాద్ కు బయలుదేరి వెళ్లారు.బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి తన స్వగృహానికి కారులో బయలుదేరిన చంద్రబాబుకి అక్కడ కూడా అదే ఆదరణ,అదే అభిమానంతో ఘన స్వాగతం పలికారు బాబు అభిమానులు.

బాబు…”ఐయామ్ విత్ యు”అంటూ నినాదాలు చేస్తూ ఐటీ ఉద్యోగులు, టీడీపీ కార్యకర్తలు, బాబు అభిమానులు బాబుకి పూలతో స్వాగతం పలికారు.’నేను తెలుగు భాష లెక్క అడాఉంటా ఈడ ఉంటా’ అన్నట్టు బాబుకి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల మద్దతు దక్కడంతో తెలంగాణాలో స్తబ్దుగా ఉన్న తెలుగుదేశం అభిమానాన్ని ప్రజలలో మరోసారి తట్టిలేపినట్టయింది జగన్ మోహన్ రెడ్డి.

“తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది” అన్నట్లుగా చంద్రబాబుని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని జగన్ చేసిన ప్రయత్నం ఇప్పుడు ప్రజలు ముందు ఎవరిని దోషిగా నిలబెట్టిందో ఇప్పటికైనా ఈ వైకాపా నాయకులకు అర్ధమవుతుందో లేదో. వారి భాషలోనే చెప్పాలంటే ఇదంతా దేవుడి స్క్రిప్ట్ లో భాగమే అని చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories