టీడీపీ సీనియర్ నేత సతీష్ కుమార్ రెడ్డి పార్టీని వీడటానికి సిద్ధం అయ్యారు. వేంపల్లెలోని తన నివాసంలో ముఖ్య వర్గీయులతో సమావేశమైన ఆయన లో తాను టీడీపీని వీడుతున్నట్లు సతీష్ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడుతున్నా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సరైన ఆదరణ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మనసును చంపుకొని తెలుగుదేశం పార్టీలో ఉండేది లేదని స్పష్టం చేశారు. సతీష్ కడపలో టీడీపీకి చాలా కీలకనేతగా వ్యవహరించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రెండుసార్లు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రెండుసార్లు సతీష్ రెడ్డి పోటీ ఇచ్చారు. అయితే రనాలుగు సార్లు ఆయన వారి చేతిలో ఘోరపరాజయం పొందారు.
వారి చేతిలో ఓటమి పాలైనప్పటికీ… పులివెందులలో బలమైన నేత కావాలి కాబట్టి టీడీపీ సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా మండలి డిప్యూటీ చైర్మన్‌ను చేసింది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్యకేసులో సతీష్ ప్రమేయం ఉందని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ వారు ఆరోపణలు చేశారు.
ఇప్పుడు అదే సతీష్ ని పార్టీలోకి చేర్చుకోవడానికి జగన్ సిద్ధం అవుతున్నారు. మరో వైపు కడప జిల్లాకే చెందిన మాజీ మంత్రి రామసుబ్బా రెడ్డి కూడా టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతారని గట్టిగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన టీడీపీలోనే ఉంటున్నట్టు ప్రకటించారు.



