టీ ట్వంటీ సిరీస్ టీమిండియాదే!

team india will win t20 seriesఆస్ట్రేలియా గడ్డపై ఎట్టకేలకు భారత జట్టు ఓ సిరీస్ ను సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భాగంగా తొలి రెండు మ్యాచ్ లలో జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు ధావన్ (42), రోహిత్ శర్మ (60) మంచి శుభారంభాన్నిచ్చారు. అనంతరం వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ (59 నాటౌట్) మరింత ధాటిగా ఆడడంతో భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం 185 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ఇన్నింగ్స్ ధాటిగా ప్రారంభించింది.

ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (74), షాన్ మార్ష్ (23) వీర విహారం చేసి తొలి 9 ఓవర్లలోనే 90కి పైగా పరుగులు సాధించడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. అయితే ఈ దశలో స్పిన్నర్లను రంగంలోకి దించడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. మార్ష్ ను అశ్విన్ పెవిలియన్ బాటపట్టించడంతో ఆసీస్ పతనం మొదలైంది. లిన్ (2), మ్యాక్స్ వెల్ (1), షేన్ వాట్సన్ (15), జేమ్స్ ఫాల్కనర్ (10), జాన్ హేస్టింగ్స్ (4), టై (4) వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది. మథ్యూ వేడ్ (16) నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది.

ADVERTISEMENT

భారత బౌలర్లలో జడేజా, బుమ్రా చెరో రెండు వికెట్లు తీయగా, అశ్విన్, పాండ్య చెరో వికెట్ తో రాణించారు. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు సిరీస్ గెలుచుకుంది. దీంతో ఆసీస్ లో టీ ట్వంటీ మ్యాచ్ గెలిచిన కెప్టెన్ గా ధోనీ నిలిచాడు. చాలా కాలం తర్వాత ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా మరి కొద్ది రోజుల్లో టీ-20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈ విజయం భారత జట్టుకు మరింత విశ్వాసాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories