ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్ల ముందుకొచ్చిన హనుమాన్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. స్టార్స్ ఎవ్వరు లేని చిన్న సినిమా గా వచ్చి బడా హీరోల సినిమాలతో పోటీపడి తన స్థాయిని స్థానాన్ని పెంచుకుంది హనుమాన్.
వెండి తెర మీద రికార్డుల మోత మోగించిన హనుమన్ మూవీ కోసం ఓటిటి ప్రేక్షకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే మార్చి 2 నా జీ 5 లో స్టీమ్ అవుతుంది అని ప్రకటించిన చిత్ర యూనిట్..కాదు కాదు శివరాత్రికి విడుదలవుతుంది అంటూ డేట్ మార్చారు.
శివరాత్రి పండగ పూట హనుమాన్ మూవీ విడుదల కాబోతుంది అని మూవీ చూడడానికి ఆశ పడిన ఓటిటి ప్రియులకు మరోసారి నిరాశే ఎదురయ్యింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా హనుమాన్ ఓటిటి విడుదల మరోసారి వాయిదా పడింది అంటూ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
అయితే హనుమాన్ హిందీ వెర్షన్ మార్చి 16 న జియో సినిమాలో విడుదల కాబోతుంది అంటూ అధికారిక ప్రకటన వచ్చిన నేపథ్యంలో తెలుగు వెర్షన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకుల కోసం సదరు ఓటిటి సంస్థ కానీ, చిత్ర యూనిట్ కానీ ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.




