‘నాకు కాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ’ అంటూ ఒక్క డైలాగ్ తో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ బ్యూటీ తేజస్వి, ‘ఐస్ క్రీం’ సినిమాతో హాట్ పాపగా మారిపోయింది. అప్పటినుండి చిన్న సినిమాలలో గ్లామరస్ తెలుగు హీరోయిన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన తేజస్వి, ఇటీవలే ‘బాబు బాగా బిజీ’ చిత్రంలో మరో హాట్ పాత్ర పోషించి అందాలు ఆరబోసింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ ‘అడల్ట్ కామెడీ’కి ప్రజాధరణ లేకపోవడంతో, ఈ బ్యూటీ అందాలన్నీ వృధా అయ్యాయి.
అయితే ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం మరోసారి ‘సెక్స్ ఎంటర్టైన్మెంట్’ సినిమాకు తేజస్వి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. 2012లో విడుదలైన మరాఠీ చిత్రం “బలక్ పలక్” సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న నేపధ్యంలో… ఈ సినిమాలో కాలేజీ గర్ల్ పాత్రలో తేజస్వి కనిపించబోతుందట. యువతరానికి సెక్స్ ఎడ్యుకేషన్ అందించే చిత్రంగా విమర్శకుల అభిప్రాయం అందిపుచ్చుకున్న ఈ సినిమా ద్వారా వెలగలేటి శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
ఓ పక్కన సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పెడుతూ నెటిజన్లను తన వైపుకు తిప్పుకుంటున్న తేజస్వి, మరో వైపు ఇలా అడల్ట్ కంటెంట్స్ ఉన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యువతరానికి పిచ్చెక్కిస్తోంది. ఏది ఏమైనా ఒక తెలుగు బ్యూటీ బాలీవుడ్ హీరోయిన్ల మాదిరి సినిమాలను ఒప్పుకోవడం, అందాల ప్రదర్శన చేస్తుండడంతో తేజస్వి పేరు ట్రేడ్ వర్గాలలో మారుమ్రోగుతోంది. చూడబోతుంటే… చిన్న సినిమాలకు పెద్ద హీరోయిన్ గా తేజస్వి అవతరించనుందనే సంకేతాలు కనపడుతున్నాయి.



