‘బిగ్ బాస్’ బ్యూటీ బ్యాక్ ఇన్ యాక్షన్!

Tejaswi Madivada Latest Photoshootతెలుగు ‘బిగ్ బాస్’ హౌస్ లో ఖచ్చితంగా ఉంటుందని భావించిన తెలుగు హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ, అందుకు ‘నో’ చెప్పిన విషయం తెలిసిందే. ఎందుకు ‘నో’ చెప్పిందో అన్న కారణాలు లేవు గానీ, ప్రస్తుతం బిజీ బిజీ సినీ షెడ్యూల్స్ కూడా ఏమీ లేవన్నది ట్రేడ్ టాక్. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ హాట్ ఫోటోల ద్వారా ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే తేజస్వి, ఇటీవల ఆ ఉధృతి కూడా తగ్గించింది.

దీంతో ప్రస్తుతం ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతుందేమో అన్న ధోరణిలో ఉండగా తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేసింది. సరికొత్త ఫోటోషూట్ అతి త్వరలో… అంటూ వీక్షకులను ఊరిస్తోన్న ఈ ముద్దుగుమ్మ, ఈ సారి తన టార్గెట్ పెద్దదిగా హాష్ ట్యాగ్ చేసింది. ఈ ఫోటోలు చూస్తున్న వారంతా…. “ఇలాంటి బ్యూటీనే కదా… బిగ్ బాస్ షోకు కావాల్సిన అసలు ఆకర్షణ…” అంటూ నిట్టూర్పును ప్రదర్శించడం విశేషం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories