కాంగ్రెస్ చచ్చిన పార్టీ అయితే తెలంగాణాలో బీజేపీ పరిస్థితి ఏంటి?

Telangana BJP President, Lakshman!కాంగ్రెస్ ను చచ్చిన పార్టీ అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనలో బిజెపిపైన, ప్రధాని నరేంద్ర మోడీపైన చేసిన విమర్శలను ఆయన ఖండించారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని ఆయన అన్నారు.

[m9ad]

ADVERTISEMENT

అసలు కాంగ్రెస్ చచ్చిన పార్టీ అని ,రాహుల్ ఎక్కడకు వెళితే అక్కడ కాంగ్రెస్ ఓటమి ఖాయమని ఆయన అన్నారు. రాహుల్ పర్యటనతో ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ జెండా కప్పుకున్నవారిని ప్రజలు క్షమించరని ఆయన అన్నారు.

చచ్చిన పార్టీ అయినా తెలంగాణాలో కాంగ్రెస్ ఉన్నంత బలంగా బీజేపీ లేదుగా. కాంగ్రెస్ కు కనీసం ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంది బీజేపీకి కనీసం 2014లో వచ్చినన్ని సీట్లు కూడా రావడం కష్టమే కదా? కేంద్రానికి భయపడి బీజేపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ చేర్చుకోలేదుగానీ లేకపోతే తెలంగాణలో బీజేపీ కూడా ఖాళి అయ్యేదే కదా?

ADVERTISEMENT
Latest Stories