టీఆర్ఎస్ స్థాపించిన రోజు కేసీఆర్ ఇలా ఉన్నారు!

KCR speech TRS2001, ఏప్రిల్ 27వ తేదీన ‘తెలంగాణా రాష్ట్ర సమితి’ పేరుతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించారు. అప్పట్లో ఉన్న ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సభ్యులైన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సూచనల మేరకు మంత్రి పదవి ఇవ్వని తెలుగుదేశం పార్టీపై అలిగి కొత్త పార్టీని స్థాపించారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ టీఆర్ఎస్ లక్ష్యాలను క్రమక్రమంగా నిర్దేశించుకున్న కేసీఆర్ కాలక్రమేణా అనుకున్నది సాధించగలిగారు.

‘ప్రత్యేక తెలంగాణా’ సాధనే లక్ష్యంగా పనిచేసిన కేసీఆర్ 2014లో అదే కాంగ్రెస్ అండదండలతో ఆ ‘కల’ను సాకారం చేసుకున్నారు. అంతేకాదు, బంగారు తెలంగాణాగా మారుస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. రాజకీయాల్లోకి రావడమే ముఖ్యమంత్రి కావాలన్న అత్యాశను వ్యక్తపరుస్తున్న జగన్ వంటి వారికి కేసీఆర్ రాజకీయ జీవితం ఆదర్శప్రాయం. 2001లో టీఆర్ఎస్ స్థాపించిన రోజున ‘తానూ కూడా ముఖ్యమంత్రిని అవుతానని’ బహుశా కేసీఆర్ కూడా భావించి ఉండకపోవచ్చు. కానీ కాలానికనుగుణంగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, తనలోని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని సిఎం స్థాయికి వెళ్లారు.

ADVERTISEMENT

ఇప్పటి కేసీఆర్ ను చూస్తున్న జనాలు పదిహేనేళ్ళ క్రిందట పార్టీ స్థాపించిన రోజున కేసీఆర్ ఎలా ఉండి ఉంటారు… అన్న ప్రశ్నకు సమాధానమే ఈ ఫోటో. దీన్ని చూస్తే ‘ఊసరవెల్లి’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన ‘కరెంట్ తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది… దీనమ్మా టచ్ చేస్తే షాకే…’ అన్న డైలాగ్ గుర్తుకు రాక మానదు. అలాంటి సన్న పుల్లలా, రింగులు తిరిగిన జుట్టుతో, నిలువు బొట్టుతో ప్రసంగం ఇచ్చారు. పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అప్పటినుండి ఇప్పటివరకు అనేక మంది అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు మరి!

ADVERTISEMENT
Latest Stories