హవ్వా… ఇవేనా గుణాత్మక రాజకీయాలు కేసీఆర్ గారూ!

Telangana Congress MLC joining in TRS KCR గెలిచిన వాడు ఏమైనా చెప్పొచ్చు ఓడిపోయినవాడు గెలిచినవాడు ఏం చెప్పినా మారు మాట్లాడకుండా వినాల్సిందే. చారిత్రాత్మక గెలుపు అయితే ఇంక మాట్లాడే అవకాశం ఎవరికీ లేనట్టే. సరిగ్గా తెలంగాణాలో ఇదే జరిగింది. రెండవ సారి అత్యధిక మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రెండు రోజుల తరువాత చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. అసలు దేశంలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయం తుచ్ఛమని దానికి మనందరం సిగ్గు పడాలని చెప్పుకొచ్చారు.

[m9ad]

ADVERTISEMENT

దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు తీసుకువస్తా అని ఆయన మీడియా ముఖంగా ప్రకటించేసి ఆ క్రమంలో పూర్తి స్థాయిలో కేబినెట్ ను కూడా నెలకొల్పకముందే వివిధ పార్టీల కీలక నేతలను కలవడానికి రేపటి నుండి బయల్దేరుతున్నారు. అయితే దీనికి కొంచెం ముందుగా తెలంగాణాలో కొన్ని పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. కాంగ్రెస్ నుండి తెరాసలోకి చేరిన కొంత మంది ఎమ్మెల్సీలు ఒక సమావేశం పెట్టుకుని కాంగ్రెస్ కౌన్సిల్ పక్షాన్ని తెరాసలోకి విలీనం చేస్తున్నామని కౌన్సిల్ ఛైర్మన్ కు లెటర్ ఇచ్చారు.

వీరు కొందరి మీద ఇప్పటికే కాంగ్రెస్ ఫిరాయింపు చట్టం కింద కంప్లయింట్ చేసింది. అటువంటి వారు విలీనం చేస్తున్నాం అని చెప్పడంతో కౌన్సిల్ ఛైర్మన్ వెనువెంటనే విలీనం చేసేశారు. తెరాస నుండి కాంగ్రెస్ లోకి కొంత మంది ఎమ్మెల్సీలు చేరారు వారి మీద అధికార పార్టీ కంప్లయింట్ చేసింది. ముందు చేసిన కాంగ్రెస్ కంప్లయింట్ ను పట్టించుకోకుండా వెనుక చేసిన తెరాస కంప్లయింట్ ను పట్టించుకుంటే విమర్శలు వస్తాయని ఏకంగా ఆ పార్టీని విలీనం చేయించేశారు.

ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన కంప్లయింట్ కు విలువ లేదు గనుక తెరాస ఇచ్చిన కంప్లయింట్ మీద ఆగమేఘాల మీద చర్యలు తీసుకోవచ్చు. గతంలో టీడీపీ మీద కూడా ఇదే రకమైన వ్యూహం అనుసరించారు కేసీఆర్. ఇటువంటి పని చేస్తూ గుణాత్మక రాజకీయం చేస్తాం అని చెప్తే నమ్మే వారు ఉంటారా? ఇప్పటిదాకా దేశంలో నడిచింది ఈ రాజకీయం కాదా? ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినా ఇంతే అన్నమాట. సహజంగా ఇటువంటి పోకడలను నియంత పాలన అంటారు. అయితే ఇప్పుడు మహాబలవంతుడైన కేసీఆర్ చేస్తున్నారు గనుక అలా అనే సాహసం మీడియా చెయ్యలేదు.

ADVERTISEMENT
Latest Stories