పోటీ కూడా చెయ్యలేని వాడివి గెలవడం సంగతి నీకెందుకు?

Telangana JanaSena Party Sankar Goud Pawan Kalyanసోషల్ మీడియా సాక్షిగా జనసేన తెలంగాణ రాష్ట్ర సమితి బాహాబాహీకి దిగడం విశేషం. ఇటీవలే బీజేపీకి మద్దతు తెల్పిన జనసేన మీద తెరాస ఎమ్మెల్యే బల్కా సుమన్ పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేనోడు ఇక్కడ ఏం చేస్తాడు?. విస్తృత ప్రయోజనాల కోసం పోటీచేయట్లేదంట.. ఈ మాటలు వింటుంటే జనాలు నవ్వుకుంటున్నారు అంటూ విరుచుకుపడ్డారు.

ADVERTISEMENT

అయితే దీనికి జనసేన తెలంగాణ ఇంఛార్జ్ శంకర్ గౌడ్ ఒక బహిరంగ లేఖ ద్వారా సమాధానం చెప్పారు. “మా పార్టీ అధినేత పై అహంకారపూరిత వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా. డబ్బు ఖర్చు పెట్టకుండా ఒక్క వార్డ్ అయినా మీరు గెలవగలరా? మీకు మీ నాయకులకు దమ్ము ఉంటే ఒక్క రూపాయి లేకుండా ఎన్నికలు గెలిచి చూపించాలి,” అని సవాలు చేశారు.

“అటువంటి మీరు జీరో బడ్జెట్ రాజకీయాలు చెయ్యాలని వచ్చిన మమల్ని విమర్శిస్తున్నారా? మా ఓటమిలో కూడా నిజాయితీ ఉంది,” అన్నారు ఆయన. అయితే దానికి సోషల్ మీడియాలోని తెరాస అభిమానులు గట్టిగా స్పందిస్తున్నారు. అసలు పోటీ కూడా చెయ్యలేని పార్టీది గెలవడం సంగతి మీకెందుకు? అంటూ జనసేనను ఎద్దేవా చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా…. బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చెయ్యాలని బీజేపీ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఆయన ప్రచారానికి వెళ్తే ఆ సందర్భంగా అధికార పార్టీ మీద విమర్శలు చేస్తారేమో చూడాలి. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. 4న ఫలితాలు వస్తాయి.

ADVERTISEMENT
Latest Stories