తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, ప్రచారం మంచి ఊపు మీద సాగుతుంది. ఒక పక్క కేసీఆర్ అశీర్వాద సభల పేరుతో మళ్లీ అధికారం కోసం విశ్వ ప్రయత్నాలే చేస్తూ ఉంటే, మరో పక్క ప్రజాకూటమి పేరుతో రంగంలోకి దిగిన పార్టీలు తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి. ఇక ఈ దూకుడులో భాగంగా ఈరోజు రంగంలోకి దిగిన నటసింహం బాలయ్య, తనదైన శైలిలో నవ్వుతూ, శెటైర్స్ వేస్తూ, అభిమానులను, కార్యకర్తలను అలరిస్తూ ప్రత్యర్ధులకు నరకం చూపించాడు. ఒక పక్క చంద్రబాబుపై తెరాస పార్టీ వాళ్ళు చేస్తున్న విమర్శలపై మాట్లాడుతూ…అరె అమెరికా అధ్యక్షుడి బిడ్డని తీసుకొచ్చి మీ బిల్డప్పులు ఏందీ భాయ్…నాకు అర్ధం కావడం లేదు. 15 ఏళ్ళ ముందటే వాళ్ళ బాబులని ఇక్కడ గుట్టల్లో నడిపించాడు చంద్రబాబు అంటూ దడదడ లాడించాడు బాలయ్య.
[m9ad]
అంతేనా, బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ మాహిష్మతీ సామ్రాజ్యాన్ని పాలించేది బల్లాలదేవుడే అయినా.. జనం యాద్ పెట్టుకునేది ఎవరిని… బాహుబలినేనని మరవొద్దు అంటూ బాబుని బాహుబలిగా నిలబెట్టి, చివరకు కేసీఆర్ ని బల్లాలదేవుడి పాత్రకు పరిమితం చేసేసాడు. బాబు మూడ్ వస్తే ఫామ్ హౌస్ లో పాడుకునే వ్యక్తి కాదు అని మూడొస్తే స్టేట్ కోసం నలుదిశలా తిరిగే వాడు చంద్రబాబు అని ఆయన బాబుని కొనియాడారు. అంతేనా… డిల్లీ గల్లీల్లో వంగి వంగి సలాం కొట్టే వాడు కాదు బాబు అని, ప్రపంచ దేశాల గల్లీల్లో తిరిగి పెట్టుబడులు రాబట్టే వాడు అని, అదే క్రమంలో డిల్లీపై యుద్దం చేస్తున్న బాబుపై ప్రశంసల వర్షం కురిపించాడు బాలయ్య. ఇక చంద్రబాబు ని అవుట్ చేయాలనుకుంటే మీ అంత ఔట్-అండ్-ఔట్ కామెడీయన్స్ ఎవ్వరూ ఉండరు అని ఛలోక్తులు విసిరారు బాలయ్య. లాప్టాప్ కనిపెట్టింది బాబు అంటూ కుళ్ళు సెటైరులు వేస్తున్నారు.. అమెరికా అధ్యక్షుడి కూతుర్ని తీసుకువచ్చి పులి వేషాలు వేసింది మీరు భయ్..15 ఏళ్ళ ముందటే వాళ్ళ బాబులని పట్టుకువచ్చాడు బాబు అంటూ మరోమారు ఆ నాడు బాబు ఐటీ నిర్మాణం కోసం పడ్డ కష్టాలను తనదైన శైలిలో వివరించారు బాలయ్య.
అంతేకాదు చంద్రబాబు కట్టిన కట్టడాల్లో మీటింగ్స్ పెట్టుకుని, ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డగా చెప్పుకుంటున్నారు టీఆరెస్ వాళ్ళు అంటూనే…అరె మీ గల్లీ బుద్దులు చూస్తుంటే జాలేస్తుంది భయ్ నాకు అంటూ కేసీఆర్ అండ్ పార్టీ పై శెటైర్స్ వేశారు బాలయ్య. మొత్తంగా ఒక పక్క బాబు విలువ తెలుపుతూనే, మరో పక్క కేసీఆర్ అండ్ పార్టీపై తన ఉగ్ర రూపాన్ని చూపించాడు బాలయ్య.



