కాంగ్రెస్ నుండి టీడీపీ కోరుతున్న సీట్లు ఇవే

Telangana TDP requesting important constituencies from congressకాంగ్రెస్ నుండి తెలుగు దేశం పార్టీ 28 సీట్లు కోరుతున్నట్టుగా సమాచారం. ఈ ప్రకారంగా రెండు రకాల జాబితాలు తయారు చేసి పంపినట్టు సమాచారం. టీడీపీ ప్రతిపాదించిన మొదటి జాబితాలో ఉప్పల్, కూకట్‌పల్లి, కోదాడ, ఖమ్మం, అశ్వారావుపేట, సత్తుపల్లి, పఠాన్‌చెరువు, నిజామాబాద్‌ రూరల్, బాల్కొండ, మహబూబ్‌నగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌ నియోజకవర్గాలున్నాయి.

[m9ad]

ADVERTISEMENT

వీటికి తోడు ముఖ్యనేతల కోసం రెండు నియోజకవర్గాల చొప్పున పేర్లను కూడా పంపింది. అందులో నకిరేకల్‌/తుంగతుర్తి, నర్సంపేట/పరకాల, వరంగల్‌ ఈస్ట్‌/ వరంగల్‌ వెస్ట్, హుజూరాబాద్‌/హుస్నాబాద్, జగిత్యాల/కోరుట్ల, వనపర్తి/దేవరకద్ర, మక్తల్‌/నారాయణ పేట్, సికింద్రాబాద్‌/సనత్‌నగర్‌ నియోజకవర్గాలున్నాయి.

అయితే రెండో జాబితాలో టిడిపి ముఖ్య నేతల విషయంలో పీటముడి పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే, టీడీపీ అడిగిన స్థానాలన్నింటినీ ఇవ్వలేమని, తమ పార్టీకి చెందిన ముఖ్య నేతలకు కూడా అవకాశం కల్పించాల్సి ఉన్నందున 13–15 స్థానాలు ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది.

ADVERTISEMENT
Latest Stories