తెలంగాణాలో ‘పంచభూతాలు’ టూరిజం అభివృద్ధికే!

Helicopter tour in Hyderabadమిగులు బడ్జెట్ తో అనేక సంక్షేమ పధకాలకు శ్రీకారం చుడుతున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, రాజధాని హైదరాబాద్ వేదికగా టూరిజంను అభివృద్ధి చేయడానికి అనేక ప్లాన్లతో ముందుకొస్తోంది. వినూత్న కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ‘హెలి’ టూరిజం పేరుతో గాలిలో భాగ్యనగరం అందాలను 15 నిముషాలలో చుట్టి వచ్చే ఒక అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది తెలంగాణా ప్రభుత్వం. తాజాగా బోట్ షికార్లతో హైదరాబాద్ ప్రజలను చల్లబరిచి తెలంగాణా టూరిజంను అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టింది తెలంగాణా టూరిజం శాఖ.

‘హెలి’ టూరిజంను తెలంగాణా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించగా, ఈ లగ్జరీ స్పీడ్ బోట్ ను మాత్రం తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి టెన్నిస్ స్టార్ “సానియా మీర్జా” చేతుల మీద ప్రారంభించారు. ఈ లగ్జరీ బోట్లను అమెరికా నుండి దిగుమతి చేసుకున్నారు కేసీఆర్ సర్కార్. ఈ స్పీడ్ బోట్ లో ప్రయాణించాలంటే వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

ADVERTISEMENT

అలాగే ఈ బోట్ లో ఏమైనా వినోదాత్మక కార్యక్రమాల అనుమతికి మాత్రం గంటకు రెండు వేల రూపాయల వరకు వసూలు చేస్తామని టూరిజం కార్పోరేషన్ స్పష్టం చేసింది. ‘కాదేదీ కవితనార్హం’ అన్నట్లు… తెలంగాణా సర్కార్ ఇలా గాలి, నీరు లాంటి పంచభూతాలను ఉపయోగించి తెలంగాణా టూరిజంను అభివృద్ధి పధంలో నడిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories