ఈ మధ్యకాలంలో ఇటు టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు దాదాపుగా అన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతూ తమ సినిమా స్థాయిని, హీరో క్రెజ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
అలాగే అటు బాలీవుడ్ కూడా మన తెలుగు సినిమాల పట్ల ఇక్కడి హీరోల పట్ల కూడా అదే ఆదరణ చూపుతుంది. అలాగే బాలీవుడ్ మూవీస్ లో తెలుగు హీరోలకు, హీరోయిన్స్ కు అగ్రతాంబూలం కూడా దక్కుతుంది. అలాగే స్టార్ హీరోల సినిమాలకే కాదు కంటెంట్ బాగుంటే స్టార్ తో కూడా సంబంధం లేకుండా తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో అలరిస్తుంది అనడంలో నిఖిల్ ‘కార్తికేయ -2 ‘, తేజ సజ్జ ‘హనుమాన్’, కిరణ్ అబ్బవరం ‘క’ మూవీలు నిరూపించాయి.
అలాగే అటు కథ, కథనం ఆకట్టుకునేలా ఉంటే చాలు ఇతర భాష చిత్రాలను ఆదరించడంలో ఎప్పుడు ముందువరుసలో ఉండే తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఒక సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ ‘ఛావా’…మూవీ తెలుగు వర్షన్ అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమా మీద ఆసక్తి ఉన్నా భాష అర్ధం కాకా చూడలేకపోతున్నాం అంటూ తెలుగు ఆడియెన్స్ ఆవేదన చెందుతున్నారు.
ఇటువంటి హిస్టారికల్ మూవీస్ అన్ని భాషలలో అందుబాటులో ఉంచాలి కదా అంటూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. నేటి కాలంలో యాక్షన్, కామెడీ ..ఇలా ఏ భాష చిత్రమైన అన్ని భాషలలో అనువదించబడి పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న క్రమంలో ఇలా చరిత్రలు చెప్పే కథలు హిందీ భాషకు మత్రమే ఎందుకు పరిమితం చేసారంటూ గగ్గోలు పెడుతున్నారు.
అందులోను ఈ మూవీ లో మహారాణి పాత్రలో ఆకట్టుకున్న హీరోయిన్ రష్మిక కు తెలుగులో అభిమానులు ఎక్కువ. దీనితో కనీసం ఓటిటి లో అయిన తెలుగు వర్షన్ అందుబాటులో ఉంచాలనే డిమాండ్ పెరుగుతుంది. మరి ఛావా చిత్ర యూనిట్ తెలుగు ఆడియన్స్ విన్నపాలు వినిపించుకుని తెలుగు వారికి వారి సొంత భాషలో ఈ మూవీ చూసే అవకాశాన్ని కల్పిస్తారా.? లేదా.? అనేది చూడాలి.




