నాని… మీ ఇంట్లో లేడీస్ జాగ్రత్త..!

నాని... మీ ఇంట్లో లేడీస్ జాగ్రత్త..!ఆంధ్రప్రదేశ్ లోని సినిమా పరిస్థితులపై స్పందించిన నాచురల్ స్టార్ నానికి టిడిపి నేత అనిత పలు సూచనలు చేసారు. సినీ పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై నాని మాట్లాడడం అభినందనీయం అని చెప్పిన అనిత, ఇపుడు ఆయన ఇంట్లోని మహిళలను వైసీపీ మంత్రులు టార్గెట్ చేస్తారని అన్నారు.

కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతి రాజు లాంటి దిగ్గజ నేతలనే తిట్టిన ఏపీ మంత్రులకు నాని కుటుంబ సభ్యులను తిట్టడం పెద్ద విషయం కాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని రంగాలను ఇబ్బందులపాలు చేస్తోన్న జగన్ సర్కార్, సినీ పరిశ్రమకు కూడా అన్యాయం చేస్తోందని అన్నారు.

ADVERTISEMENT

నాని మాదిరి టాలీవుడ్ లోని పెద్ద హీరోలందరూ కూడా స్పందించాలని, విజయవాడ వచ్చి జగన్ ను, పేర్ని నానిని కలిసి వెళ్లే పెద్ద హీరోలు పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై కూడా ధైర్యంగా స్పందించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ మాత్రం సమంజసం కాదని ఈ సందర్భంగా అనిత అన్నారు.

అనిత చెప్పినట్లుగా నాని కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తారో లేదో గానీ, రేపు రిలీజ్ కానున్న “శ్యామ్ సింగ రాయ్”పై మాత్రం ప్రభావం పడుతుందన్న టాక్ బలంగా వినపడుతోంది. ఇప్పటికే నాని వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇవ్వగా, నట్టి కుమార్ వంటి వాళ్ళు ఇండస్ట్రీ నుండే జగన్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories