‘దేవిశ్రీ’ని మించిపోయేలా ఉన్నాడే ‘థమన్!’

thaman-beats-devi-sri-prasadసినిమాకు అందించే పాటల విషయంలో ఎంతవరకు న్యాయం చేసినా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో మాత్రం యస్.యస్.థమన్ తన సత్తా చూపిస్తున్నాడు. ‘బిజినెస్ మెన్’ చిత్రంలో అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ తో మొదలైన థమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీత ప్రస్థానం తాజాగా విడుదలైన “సరైనోడు” వరకు నిరంతరంగా కొనసాగుతోంది. దీంతో టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్రస్థానాన కొనసాగుతున్న దేవిశ్రీ ప్రసాద్ కు థమన్ గట్టిపోటీ ఇస్తున్నారు.

ఒక్క సినిమా సంగీతంలోనే కాదు, స్టేజ్ షోలలో కూడా దేవికి ప్రత్యామ్నాయంగా థమన్ తన ఉనికిని చాటడానికి ప్రయత్నిస్తున్నట్లుంది. స్టేజ్ పై దేవి సృష్టించే హంగామా ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి దీటుగా థమన్ అమెరికాలో ఓ లైవ్ షోను ప్లాన్ చేసారు.

ADVERTISEMENT

తెలుగు నూతన సంవత్సరం ‘ఉగాది’ సందర్భంగా అమెరికాలోని 8 నగరాల్లో 8 షోలు నిర్వహించబోతున్నారు థమన్. దీనికి సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. థమన్ మార్క్ డ్రమ్స్ తో ప్రారంభమైన ప్రోమోలో ‘స్టిక్ పట్టుకుని’ ఉన్న చివరి థమన్ లుక్కు వరకు బ్యాక్ గ్రౌండ్ సంగీతం అదరగొట్టాడు. మరి ఆ ప్రోమోను ఓ సారి వీక్షించేస్తే పోలా..!

ADVERTISEMENT
Latest Stories