నవతరం దర్శకుల రాకతో టాలీవుడ్ లో కూడా సరికొత్త కధలు పురుడు పోసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ కోవలోనే తాజాగా “ది డ్రిఫ్టర్” అనే పేరుతో మరో సినిమా వచ్చే అక్టోబర్ లో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. అభిలాష్ మక్కెన దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ లో కేవలం మూడే మూడు పాత్రలు కనిపిస్తాయి.
[m9ad]
ADVERTISEMENT
పృథ్వి రాజ్ సంపర, సత్రుజ్ఞ రాయపాటిలు ప్రధాన పాత్రలలో నటించగా, మూడవ పాత్రను కారు పోషించింది. ‘గుర్తుందా… ఇందాకా చెప్పాను… ఇప్పుడు నేను చెప్పేది ఏదీ అర్ధం కాదు… అన్ టిల్…’ అంటూ వదిలిపెట్టిన ట్రైలర్ లో ఎలాంటి క్లూ ఇవ్వలేదు.
అయితే ఇలాంటి సబ్జెక్ట్ లు రెండున్నర్ర గంటల పాటు కమర్షియల్ గా ఎంతవరకు వర్కౌట్ అవుతాయో తెలియదు గానీ, షార్ట్ ఫిల్మ్స్ కు బాగా వర్కౌట్ అవుతాయి.
Watch the THE DRIFTER Official Trailer below;
ADVERTISEMENT



