మెగాస్టార్ చిరంజీవి ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ది చాలా స్పెషల్ రిలేషన్, ఇద్దరికీ బాండింగ్ కూడా చాలానే ఎక్కువ.
చిరుకి జగదేకవీరుడు అతిలోక సుందరి, ఇంద్ర లాంటి మర్చి పోలేని బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సంస్థ వైజయంతి.
అశ్వినీ దత్ మాట్లాడుతూ ఒక ఇంటరెస్టింగ్ విషయం బయట పెట్టారు.
చిరంజీవి కి ఫ్యామిలీ మాన్ తీసిన రాజ్ అండ్ డీకే లతో బ్లాక్ బస్టర్ అయిన సిరీస్ ని మొదట మూవీగా చిరు తో తీయాలనుకున్నారట డైరెక్టర్స్.
ఇదే విషయం చిరుని ఒప్పించడానికి ట్రై చేస్తే దాంట్లో నాకు కూతురు కొడుకు అంటున్నారు నేచేయను అన్నారంట చిరంజీవి.
అప్పటికీ అవసరం అయితే బిడ్డలని తీసేద్దాం సినిమాలో మీకు అన్నా చిరు కన్విన్స్ అవలేదట.
అశ్వినీ దత్ మాట్లాడుతూ చిరంజీవి లాంటి హీరో చేసుంటే ఫ్యామిలీ మాన్ వేరే లెవెల్ కి వెళ్ళేది, ఇది చిరంజీవి కోసం చేసిన కథ అని చెప్పడం ఈ టైం లో ఆసక్తి కరంగా మారింది ఎందుకంటే ఈ మధ్యే వచ్చిన జైలర్ లో రజినీకాంత్ తాత రోల్ వేసి బాక్స్ ఆఫీస్ ఊచ కోత కోసిన సంగతి తెలిసిందే.
ఒక రకంగా చిరంజీవి కి ఖైదీ 150 హిట్ అవడమే ప్రాబ్లెమ్ అయినట్టుంది లేదంటే ఆయన కూడా ఏజ్ తగ్గ రోల్స్ వేసి కంబ్యాక్ జర్నీ ని కూడా మెమొరబుల్ మూవీస్ తో నింపుకునేవారేమో !



