జూనియర్ ఎన్టీఆర్ కు ముప్పు తప్పేలా లేదు!

Janatha Garageకొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “జనతా గ్యారేజ్” సినిమా విడుదల తేదీ ఆగష్టు 12 అన్న విషయం తెలిసిందే. సినిమా ప్రారంభ రోజునే విడుదల తేదీ ప్రకటించి, పక్కా ప్రణాళిక ప్రకారమే షెడ్యూల్స్ జరుపుకోవడంతో అనుకున్న సమయానికే ‘జనతా గ్యారేజ్’ ఓపెన్ చేయడం ఖాయంగా కనపడుతోంది. అయితే ఇదే తేదీకి తెలుగులో చైతూ సినిమాతో పాటు మరో ప్రతిష్టాత్మక బాలీవుడ్ సినిమా కూడా విడుదల అవుతుండడంతో, ‘బుడ్డోడు’ సినిమాకు పోటీ తప్పేలా లేదు.

తాజాగా విడుదలైన హృతిక్ రోషన్ ‘మొహింజో దారో’ సినిమా ట్రైలర్లో విడుదల తేదీని ఆగష్టు 12గా ప్రకటించారు. అయితే ఒక హిందీ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కు పోటీ ఇస్తుందా… అంటే, బహుశా అది హిందీ భాషలో విడుదలైతే ప్రభావం కొంతే ఉంటుందేమో గానీ, అది డబ్బింగ్ జరుపుకుని తెలుగు భాషలో విడుదలైతే మాత్రం, ఆ ప్రభావం తారాస్థాయిలోనే ఉంటుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ట్రైలర్ విడుదలైన తర్వాత ‘మొహింజో దారో’ తెలుగు, తమిళ డబ్బింగ్ హక్కుల కోసం ఇప్పటికే పలువురు ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా సినీ వర్గాల సమాచారం.

ADVERTISEMENT

హృతిక్ కు తెలుగునాట కూడా మంచి పాపులారిటీ ఉండడం, ‘బాహుబలి’ మాదిరి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోవడం ‘మొహింజో దారో’ సినిమాపై ఆసక్తి కలిగేలా చేసాయి. ఈ సినిమా ట్రైలర్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, ట్రేడ్ వర్గాలలో ఉన్న అంచనాల రీత్యా భారీ స్థాయిలో విడుదల కావడం ఖాయం. దీంతో హృతిక్ నుండి జూనియర్ కు ముప్పు తప్పేలా లేదని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ‘జనతా గ్యారేజ్’ సినిమా విడుదల తేదీలో మార్పు ఉంటుందేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories