100 కోట్ల వసూళ్లా… టిల్లు తో అట్లుంటది మరి..!

Tillu Square

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు గా థియేటర్లకు వచ్చి పెద్ద మొత్తంలో వసూళ్లను రాబట్టుకుంటున్న సినిమాల జాబితా పెరుగుతుంది. ఇది టాలీవుడ్ కు ఒక మంచి శకునంగానే భావించాలి. మొన్న హనుమాన్ తో వచ్చిన తేజ సజ్జ అగ్ర హీరోల పోటీని తట్టుకుని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించారు.

ADVERTISEMENT

ఇప్పుడు డీజే టిల్లు మూవీకి సిఖ్వేల్ గా వచ్చిన డీజే టిల్లు స్క్వేర్ తన కామిడీ టైమింగ్ తో అటు థియేటర్లలో నవ్వులతో, ఇటు బాక్స్ ఆఫీసులో కలెక్షన్ల మోతతో తన హావ కొనసాగిస్తున్నారు. సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ మూవీ పేరుకు తగ్గట్టే కామిడీలోనే కాదు కలెక్షన్లలోనూ డీజే టిల్లు కు రెండింతలు ఉందంటూ నిరూపిస్తున్నారు ప్రేక్షకులు.

సినిమా విడుదలైన మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది అంటూ ప్రకటించిన మూవీ మేకర్స్ ఇప్పటికే ఈ మూవీ సుమారు 90 కోట్ల వసూళ్ళ ను రాబట్టుకోగలిగి 100 కోట్ల వసూళ్ళ దిశగా వెళుతుంది అంటూ తెలియచేసారు. దీనితో కామిడి మూవీ గా వచ్చిన తెలుగు సినిమాలలో ఇదే మొదటి 100 కోట్ల క్లబ్ లో చేరబోతోంది. యూఎస్ఏ మార్కెట్లో కూడా 2 మిలియన్ల మార్క్ ను క్రాస్ చేసి మూవీ మంచి జోరుమీద నడుస్తుంది.

టిల్లు థియేటర్లకు వచ్చే సమయంలో పెద్ద సినిమాలు ఏమి లేకపోవడం, మరో సినిమా పోటీలో ఉండకపోవడం, ప్రస్తుతం సిఖ్వెల్స్ మానియా నడుస్తుండడం మేకర్స్ కు కలిసి వచ్చిన అంశంగా చెప్పవచ్చు. టిల్లు – రాధికా ఫేయిర్ కు యూత్ బాగా కనెక్ట్ కావడంతో టిల్లు స్క్వేర్ పై యువత బాగ్ ఆస్తకి కనపరిచాడు. దీనితో టిల్లు స్క్వేర్ కు సిఖ్వేల్ గా టిల్లు క్యూబ్ ని ఎనౌన్స్ చేసారు చిత్ర నిర్మాతలు.

అయితే ఏప్రిల్ 5 న విడుదల కాబోతున్న విజయ్ దేవర కొండా, ఫామిలీ స్టార్ మూవీ కూడా మంచి టాక్ ను సంపాదించుకుంటే టిల్లు వసూళ్ళలో కోత పడేఅవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories