వివేకా హత్య కేసులో సీబీఐ కంటే ఈడీ స్పీడ్‌!

Avinash Reddy ED Questioning in ₹40 Crore Viveka Murder Probe

“వివేకా హత్య కేసుతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఆ ఆరోపణలతో నేను చాలా ఆవేదన అనుభవిస్తున్నాను. నేను ఏ తప్పు చేయలేదు కనుకనే ధైర్యంగా విచారణకు హాజరవుతున్నాను,” అని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చెపుతుంటారు. కనుక బుధవారం హైదరాబాద్‌లో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

ఇది ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి దారుణ హత్య కేసు. కనుక ఈ కేసు విచారణ జరుపుతున్న సీబీఐ దూకుడుగా సాగాలి. కానీ దాని వద్దే తొమ్మిది ఈడీ కేసులు ఆగిపోయాయంటూ ఈడీ తరపున తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేయాల్సి రావడం విచిత్రం. ఈ హత్య కేసులో రక్తపు మరకల సాక్ష్యాధారాలు కంటే చేతులు మారిన రూ.40 కోట్ల తాలూకా రికార్డులే కీలకం కావడం… వాటిని పట్టుకొని ఈడీ విచారణ జరుపుతుండటం మరో విచిత్రం.

ADVERTISEMENT

హత్యకు సంబంధించి సాక్ష్యాధారాలు తారుమారు కావచ్చునేమో కానీ నిందితుల మధ్య జరిగినట్లు చెప్పబడుతున్న ఆర్థిక లావాదేవీల రికార్డులు ఎన్నటికీ చెరిగిపోవు. కనుక ఒకవేళ ఈడీ అధికారులు వాటిని చేదించగలిగితే, కేసు చిక్కుముళ్ళన్నీ వాటంతట అవే విడిపోతాయి.

ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి సునీల్ కుమార్‌, దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాలతో పాటు రికార్డులు కూడా ఈడీ వద్ద ఉండే ఉంటాయి. కనుక వాటి ఆధారంగా ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలను అవినాష్ రెడ్డి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడితే? అప్పుడు డొంక మొత్తం కదులుతుంది. కనుక నేడు అవినాష్ రెడ్డి విచారణ చాలా కీలకమని భావించవచ్చు.

వైసీపీ సొంత మీడియా పొంచి ఉన్న ఈ ప్రమాదాన్ని ముందే పసికట్టి, చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఈడీ ఆడుతుంది. అయన ఎవరి పేరు చెపితే వారికి నోటీసులు పంపించి విచారణ జరుపుతుంది. అయన సూచనల మేరకే ఈడీ అధికారులు వైసీపీ నాయకులకు నోటీసులు ఇస్తున్నారంటూ ఓ కధనం వండి వార్చేసింది.

ఇదివరకు చంద్రబాబు నాయుడుతో సీబీఐ కుమ్మక్కు అయ్యిందని వైసీపీ, దాని సొంత మీడియా వాదించేవి. ఇప్పుడు ఈడీ కూడా అయన చెప్పినట్లే పనిచేస్తోందని ఆరోపిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే ఈ రెండు దర్యాప్తు సంస్థలను సిఎం చంద్రబాబు నాయుడు నిజంగా కంటి సైగతో శాసించగలరనుకుంటే, నాడు ఆయనని జగన్‌ ప్రభుత్వం అరెస్ట్ చేయగలిగేదే కాదు. వైసీపీ నేతలందరినీ ఇంతకాలం ఆయన ఉపేక్షించేవారే కాదు కదా?

తమ తప్పులకు చంద్రబాబు నాయుడునో మరొకరినో నిందించడం తేలికే. కానీ అంతమాత్రాన్న ఈ కేసుల నుంచి తప్పించుకోవడం సాధ్యపడదని ఇంకా ఎప్పుడు గ్రహిస్తారో?

ADVERTISEMENT
Latest Stories