పని ఒత్తిడి ఎదుర్కుంటున్నపెద్ద వారికి, చదువుల బరువులు మోస్తున్న చిన్న వారికీ, ఇంటి పనులు చేసుకుని అలిసిపోయిన గృహిణులకు వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే వాటిలో సినిమాలు ప్రధమ స్థానంలో ఉంటాయనే చెప్పాలి.
అయితే ఈ మధ్య కొత్త సినిమాలు చూడాలి అని ఆశ పడిన వారు వేలు ఖర్చు చేసి ధియేటర్లకే వెళ్లాల్సిన అవసరం లేదని ఓటిటి ప్లాట్ ఫామ్స్ బుల్లితెర మీదకే వెండితెర చిత్రాలను అందుబాటులోకి తీసుకు వచ్చాయి.
దీనితో చాలామంది థియేటర్లకు వెళ్లలేని ప్రేక్షకులు ఓటిటి రిలీజ్ ల కోసం ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 27 న దేవర తోపాటుగా థియేటర్లకు వచ్చిన కార్తీ సత్యం సుందరం సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఈ నెల 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది అంటూ సదరు ఓటిటి సంస్థ ప్రకటించింది.
ఇక ఈ ఫీల్ గుడ్ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూసే మూవీ లవర్స్ 27 కోసం వెయిటింగ్. అలాగే లక్కీ భాస్కర్ తో మరో సారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దుల్కర్. సీతా రామం సినిమాతో తెలుగులో మంచి హిట్ కొట్టిన దుల్కర్ ఆ తరువాత వరుస అపజయాలను మూటకట్టుకున్నారు.
అయితే తాజాగా విడుదలైన ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ సినిమా పై మంచి బజ్ ను క్రియేట్ చేసింది. దీనితో దుల్కర్ ఖాతాలో ఈసారి విజయం ఖాయమనే అభిప్రాయం బలపడుతుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాగ వంశీ నిర్మాత గా ఈ సినిమా తెరకెక్కబోతుంది.
అయితే ఈ సినిమాలో ఎవరైనా తప్పులు పట్టుకుంటే వారికి పిలిచి పార్టీ ఇస్తానంటూ నిర్మాత నాగవంశీ ప్రకటించించారంటేనే ఆయన ఈ సినిమా విజయం మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్ధమవుతుంది. గతంలో MAD సినిమా విషయంలో కూడా ఈ సినిమాలో కామెడీ లేదు అని ఎవరైనా అంటే వారికి టికెట్ డబ్బులు రీఫండ్ ఇస్తానంటూ ప్రకటించి ఎవరు రీఫండ్ అడగకుండా చేసి విజయం అందుకున్నారు.
అయితే ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న హీరో దుల్కన్ తెలుగులో ఎవరితో అయినా మల్టీ స్టారర్ మూవీ చేయడనికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని వెల్లడించి మల్టీ స్టార్ మూవీస్ చెయ్యాలనుకునే డైరెక్టర్లకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఇక ఇది బాగుండే పొట్టెలే అంటూ పొట్టేలు సినిమా ప్రమోషన్లకు వచ్చి చిన్న సినిమాకు పెద్ద ప్రమోషన్ ఇచ్చారు సందీప్ వంగా.
ఇక మోస్ట్ ఏవైటింగ్ పాన్ ఇండియా మూవీ గా క్రెజ్ దక్కించుకున్న బన్నీ సుక్కకు పుష్ప 2 ఫ్రీ బిజినెస్ 1000 కోట్లు దాటిందంటూ రిలీజ్ కు ముందే రికార్డులను నమోదు చేస్తుంది. ఒక్క థియేట్రికల్ రైట్స్ రూపంలోనే దాదాపు 640 కోట్లు వెనకేసుకున్నట్లు టాక్. ఇక ఓటిటీ రైట్స్ 275 కోట్లుగా, మ్యూజిక్ రైట్స్ 65 కోట్లుగా , సాటిలైట్ రైట్స్ మరో 85 కోట్లుగా రానున్న సినిమాల ముందు చాలా పెద్ద లెక్క ఉంచింది పుష్ప -2 .




