2025 చిన్న సినిమాలు..పెద్ద విజయాలు..

2025 Tollywood small films delivering big box office success

ఈ 2025 టాలీవుడ్ లో చిన్న సినిమాలు గా వచ్చి పెద్ద విజయాలను అందుకున్న మూవీస్ గురించి ఒక షార్ట్ రివ్యూ…

* ముందుగా 2025 సంక్రాతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి చెప్పుకుంటే 50 కోట్ల బడ్జెట్ తో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సంక్రాతి హీరోగా నిలిచి వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ గా నిలిచి 250 కోట్ల కలెక్షన్లను సాధించి టాలీవుడ్ కి శుభారంభాన్ని ఇచ్చింది.

ADVERTISEMENT

* ఇక ఫిబ్రవరి లో వచ్చిన నాగ చైతన్య – సాయి పల్లవి తండేల్ మూవీ కూడా చై ఖాతాలో మరో హిట్ ను నమోదుచేసింది. అలాగే మార్చ్ లో మ్యాడ్ కి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్-2 కూడా ప్రేక్షకుల మనసు గెలిచింది, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

* ఇక హిట్ -3 అంటూ మరో కొత్త కోణంలో ప్రేక్షుకుల ముందుకొచ్చిన నాని తన మూవీ కలెక్షన్స్ తో మరోసారి 100 కోట్ల క్లబ్ లో చేరారు. హాయ్ నాన్నా అంటూ ఇచ్చిన ఎమోషనల్ ఫీల్ ని హిట్ – 3 తో వైలెన్స్ గా మార్చేశారు నాని. అలాగే సింగిల్ అంటూ వచ్చిన శ్రీ విష్ణు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మంచి విజయాన్ని అందుకున్నారు.

* మహావతార్ నరసింహ అంటూ 40 కోట్లతో యానిమేటెడ్ మూవీ గా వచ్చిన ఈ చిత్రం ఏకంగా 320 కోట్ల కలెక్షన్లను రాబట్టి 2025 లో ఊహించని ఒక అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే హనుమాన్ తరువాత మరో సూపర్ హీరో కథతో మిరాయి అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన తేజ సజ్జ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మరోసారి 100 కోట్ల క్లబ్ లో చేరారు.

* ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్ గా లిటిల్ హార్ట్స్ తో వెండితెరకు పరిచయమైన మౌళి…నో టచ్చింగ్ ఓన్లీ హార్ట్ టచ్చింగ్ అంటూ ఎటువంటి అంచనాలు లేకుండా 2 కోట్ల బడ్జెట్ తో ధియేటర్లలోకి వచ్చి ఏకంగా 40 కోట్లు సాధించి చిన్న సినిమాలు – పెద్ద విజయాలు అనే కాన్సెప్ట్ కి ఒక బెంచ్ మార్క్ గా నిలబడింది.

అయితే ఈ మూవీస్ నిర్మాణానికి వందల కోట్ల బడ్జెట్లు పెట్టలేదు, అలాగే ఒకటి రెండు మినహాయిస్తే చాల వరకు ఈ లిస్ట్ లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు లేరు. అయినా కూడా ఈ చిత్రాలు అటు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం అందించడంతో పాటుగా ఇటు నిర్మాతలకు కోట్లలో లాభాలు తెచ్చిపెట్టాయి.

ADVERTISEMENT
Latest Stories