అరె…సినీ పరిశ్రమ నిద్రలేచిందే..!

Nani - Vijay -Deverakondaసినిమా పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేం. అయితే సహజంగా సినిమా వాళ్ళు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఆ ప్రభుత్వంతో కాస్త సఖ్యతగానే మెలుగుతారు…అన్నది అనాదిగా వస్తున్న విధానం. ఒకప్పుడు ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు, ఇక ఆతర్వాత వైఎస్ఆర్, ఇప్పుడు కేసీఆర్ అందరికీ తెలిసిందే. అయితే నువ్వా-నేనా అన్న హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంటకు తమ గెలుపుతో తెర దించారు తెరాస వాళ్ళు. ఇక ఈ క్రమంలో సినిమా పరిశ్రమ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన, భవ్య ఆనంద ప్రసాద్, మరో పక్క సినిమా పరిశ్రమ మనిషిగా కాకపోయినా, స్వర్గీయ హరి కృష్ణ గారి కుమార్తె సుహాసినీ మినహా, మిగిలిన వారెవ్వరికీ సినిమా వాళ్ళు పెద్దగా మద్దతు ఇవ్వలేదు.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఇక్కడ విజయ్ దేవరకొండ ఒక్కణ్ణి మినహాయించాలి, ఎందుకంటే స్వతహాగా కేసీఆర్ ఫ్యామిలీకి సమీప బంధువు అయిన విజయ్ కేసీఆర్ పార్టీ మళ్లీ గెలవాలి అని చెప్పడం విశేషం. అయితే ఇవన్నీ మినహాయిస్తే మాత్రం తెరాస పార్టీ తరపున సినిమా వాళ్ళు ఎవ్వరూ వకాల్తా పుచ్చుకోకపోగా, ప్రచారం చెయ్యకపోగా కనీస, మద్దతు ఇస్తున్నట్లు ఎక్కడా ప్రకటన కూడా చెయ్యలేదు. ఇదిలా ఉంటే తెరాస గెలుపు ఖాయమని తెలియగానే మాత్రం ఎవరికి వారు అభినందనల వెల్లువతో తెగ ట్వీట్స్ చేసేస్తున్నారు.

యువ హీరో మంచు మనోజ్, నాని, రచయిత, నిర్మాత అయిన కోనా వెంకట్, యువ దర్శకుడు హరీష్ శంకర్, రచయిత బీవీఎస్ రవి ట్విట్టర్ ద్వారా గెలుపుకు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ఇతరత్రా కారణాల వల్ల ఎన్నికల సమయంలో మౌనం వహించిన సినిమా పరిశ్రమ సడన్ గా నిద్ర లేచి..శుభాకాంక్షలతో అందరినీ పలకరించడం విశేషం అనే చెప్పాలి..ఎంతైనా రేపటి నుంచి ప్రభుత్వంతో చాలా పనులు ఉంటాయి అనుకోండీ…సర్దుకుపోవాలి కదా! ఏది ఏమైనా ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం సినిమా వాళ్ళను చూస్ నేర్చుకోవాలబ్బా

ADVERTISEMENT
Latest Stories