డ్రగ్స్ కేసులో టాలీవుడ్ టాప్ డైరెక్టర్?

Tollywood director involved in drugs mafiaహైదరాబాద్ నగరం మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారుతున్న వైనం ఆందోళనకు గురి చేసే అంశం. చదువులతో బిజీగా ఉండాల్సిన స్కూల్ పిల్లలు, ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ ఊబిలో కూరుకుపోతున్నారు. మాదక ద్రవ్యాల మత్తులో ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తాజాగా వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో నాలుగు ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఎనిమిది ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.

ADVERTISEMENT

విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పవిత్ర ప్రదేశంలో డ్రగ్స్ వినియోగం ఆందోళనకు గురి చేస్తోంది. ఇందులో సినీ పరిశ్రమకు చెందిన పలువురు డ్రగ్స్ వాడుతుండటం కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడి పేరు తెరపైకి రావడం షాక్ కు గురి చేసే అంశం. డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ తో ఈ దర్శకుడు రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాడట.

తాజా పరిణామాలతో టాలీవుడ్ ఫిలిం నగర్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఏడాదికి ఓ సినిమా తీస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ దర్శకుడు ఎల్ఎస్డీ డ్రగ్స్ వాడుతున్నాడన్న నిజం తెలుసుకున్న ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విస్తుపోయారట. అయితే తన కోసమే ఈ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడా? లేక ఇతరులకు ఇవ్వడానికి తీసుకుంటున్నాడా? అనే ప్రశ్నలు అధికారుల్లో తలెత్తుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories