పిక్ టాక్ – ఇది నయనానందకరం!

tollywood-directors-meet-at-director-vamsi-paidipally homeఇప్పటికే టాలీవుడ్ టాప్ దర్శకులుగా కొనసాగుతున్న వారు… భవిష్యత్తులో టాలీవుడ్ ను ఏలబోతున్న డైరెక్టర్స్… ఒక దగ్గర చేరితే ఎలా ఉంటుంది..? ఈ ఫోటో కూడా అలానే ఉంది. ‘దర్శకధీరుడు’ రాజమౌళి నుండి లేటెస్ట్ సెన్సేషన్ నాగ్ అశ్విన్ వరకు దాదాపుగా అగ్ర దర్శకులంతా ఒకే దగ్గర చేరిన ఈ ఫోటోను దర్శకుడు వంశీ పైడిపల్లి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు.

ADVERTISEMENT

తన ఇంటికి విచ్చేసి గత సాయంత్రాన్ని మధురానుభూతిగామార్చేసిన రాజమౌళికి, సుకుమార్, కొరటాల శివ, హరీష్ శంకర్, క్రిష్, అనిల్ రావిపూడి, సందీప్ వంగా, నాగ్ అశ్విన్ లకు కృతజ్ఞతలు తెలిపారు వంశీ. ఈ “నవ”తరం దర్శకుల చేతిలోనే భవిష్యత్తు టాలీవుడ్ నిక్షిప్తమై ఉంది మరి! నయనానందకరంగా మారిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ADVERTISEMENT
Latest Stories