బాలీవుడ్ భ్రమల నుంచి బయటికి రావాల్సిందే

bollywood illusionsసినిమాల పరంగా దేశంలోనే అతి పెద్ద మార్కెట్ బాలీవుడ్డే. బాహుబలి నుంచి మనమూ దాన్ని తలదన్నేలా చిత్రాలు తీస్తున్నాం కానీ అంతమాత్రాన నార్త్ ఇండస్ట్రీ పూర్తిగా అడుగంటిపోయిందని కాదు. కరోనా తర్వాత రెండేళ్ల నుంచి అక్కడి ఇండస్ట్రీ సరైన సక్సెస్ లేక కుదేలైన మాట వాస్తవమే కానీ పఠాన్ తెచ్చిన ఊపుతో ఒక్కసారిగా ఎక్కడలేని కదలిక వచ్చేసింది. అసలు సాధ్యమే కాదనుకున్న తొమ్మిది వందల కోట్ల మైలురాయిని సులభంగా అందుకునేలా అది కూడా కేవలం ఇరవై రోజులకే కావడం నిజంగా గొప్ప విషయమే. సరే ఇప్పుడీ ప్రస్తావనకు కారణమేంటనే సందేహం వస్తోందా. అక్కడికే వద్దాం

పుష్ప బ్లాక్ బస్టర్ సక్సెస్, కార్తికేయ 2 ఘనవిజయం టాలీవుడ్ చిన్న హీరోల్లోనూ ప్యాన్ ఇండియా మోజులో పడేలా చేశాయి. ఎలాగూ యూట్యూబ్ లో, శాటిలైట్ ఛానల్స్ లో మన డబ్బింగ్ సినిమాలు హిందీ జనాలు ఎగబడి చూస్తున్నప్పుడు థియేటర్ కు ఎందుకు రారనే ఆశ పుట్టడం సహజం. ఇదే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ని ఛత్రపతి రీమేక్ కు పురికొల్పింది. నిఖిల్ స్పైని అన్ని ప్రధాన భాషల్లో అనువాదం చేసేందుకు ప్రేరేపించింది. రవితేజ నిర్మాతలను ఒకే రోజు తెలుగుతో పాటు డబ్బింగ్ వెర్షన్ రిలీజులు చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. ఇవన్నీ ఉత్తరాది జనాలు మనల్ని గొప్పగా చూస్తున్నారన్న భావన వల్లే.

ADVERTISEMENT

వాస్తవిక కోణంలో ఆలోచిస్తే బాహుబలి, కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటివి ఎక్సెప్షనల్ క్యాటగిరీలోకి వస్తాయి. అంటే ఊహాతీతమైన జానర్ లో ఎవరూ ఊహించని కథలు చెప్పినప్పుడు వాటికి భాషతో సంబంధం లేకుండా ఆమోదం దక్కుతుంది. కాంతారలో కొన్ని రెగ్యులర్ అంశాలు ఉన్నప్పటికీ దైవత్వం కాన్సెప్ట్ ని కొత్తగా చూపించిన తీరు బ్రహ్మరథం దక్కించుకుంది. ఒక్క పుష్ప మాత్రమే కమర్షియల్ ఫ్లేవర్ లో ఉన్నా హిట్టు కొట్టింది. కానీ ఈ మేజిక్ ప్రతిసారి అందరూ చేసేది కాదు అందరివల్ల అయ్యేది కాదు. బన్నీకి కేరళలో నార్త్ స్టేట్స్ లో లక్కు కూడా కలిసి వచ్చింది.

ఇదంతా గతంలో ఎవరూ చేయనిది కాదు. చిరంజీవి వెంకటేష్ చెరి మూడుసార్లు సినిమాలు చేసి వర్కౌట్ కాదని వెనక్కు వచ్చారు. వెంకీ ఇన్నేళ్ల తర్వాత కిసీకా భాయ్ కిసీకా జాన్ లో దర్శనమిస్తున్నారు. నాగార్జున అడపాదడపా శివ నుంచి బ్రహ్మాస్త్ర దాకా క్యామియోలు, ఫుల్ లెన్త్ లు చేసుకుంటూ ఉన్నారు. ఒక్క బాలకృష్ణ మాత్రమే వీటికి వీటి జోలికి వెళ్ళలేదు. ఏదో ఒకటి రెండు సినిమాలకు ఢిల్లీ ముంబై జనాలు మనల్ని ఓన్ చేసుకున్నంత మాత్రాన ఇదే శాశ్వతమని చెప్పలేం. ఇంకొన్నేళ్లు చూడాలి తప్పించి తొందరపడకూడదు.ప్రభాస్ కైనా బాహుబలి రేంజ్ ఇండస్ట్రీ హిట్ ఇంకొక్కటి పడితేనే తన రేంజ్ తెలుస్తుంది. అప్పటిదాకా ఈ క్యాలికులేషన్లన్నీ నీటి మీద బుడగలే.

ADVERTISEMENT
Latest Stories