అప్పుడెప్పుడో సినీ ఇండస్ట్రీలో కి వచ్చి, తమకంటూ చేరగలేని ఒక ముద్ర వేసుకున్న నటులు ఎందరో ఉంటారు. అయితే,వారి వారసత్వంతో వారి పిల్లలు, తమ్ముళ్లు, మనవళ్ళు ఇండస్ట్రీకి రావడం సహజం. ప్రతీ ఇండస్ట్రీ లో ను ఉండేదే ఇది.
కానీ, పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు, ‘ఇండస్ట్రీ లందు టాలీవుడ్’ వేరు అని నేటి వారసులు రుజువుచేస్తున్నారు. ఏ.ఎన్.ఆర్, ఎన్.టీ.ఆర్ వంటి అగ్ర కథానాయకుల నుండి, అల్లు రామలింగయ్య,రావు గోపా రావు లాంటి కామెడీ కారెక్టర్ ఆర్టిస్టుల వారసులు నేడు టాలీవుడ్ లో హవా సాగిస్తున్నారు.
Also Read – బీసీల పరిస్థితి మారలేదు కానీ.. కృష్ణయ్యది మారిందిగా!
అయితే, ‘పలానా వారి తాలూకా’ గా ఒకరు కేవలం ఇండస్ట్రీ లో కి అడుగు పెట్టగలరంతే, అడుగు పెట్టాక, వారి స్వయంకృషి, పట్టుదల, యాక్టింగ్ నైపుణ్యాల కారణంగానే వారు ఇండస్ట్రీ లో కొనసాగగలరు, రాణించగలరు.
ఇందుకు చక్కటి ఉదాహరణ తెలుగు సినీ ఇండస్ట్రీ. నేటి తరం ఇండస్ట్రీ లో నెపోటిజం వల్ల ఇండస్ట్రీ లో అడుగు పెట్టినవారెందరో ఉన్నారు. ప్రభాస్ మొదలుకుని మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్.టీ.ఆర్, అల్లు అర్జున్, నాగ చైతన్య, అఖిల్, స్వయంగా ‘బాలకృష్ణ’-నేనూ ఒక నేపో కిడ్ నే అంటూ తన టాక్ షో ‘అన్-స్టాపబుల్’ లో అల్లు అరవింద్ గారితో పేర్కొన్నారు.
Also Read – జగన్ దెబ్బకి రేషన్ బియ్యం నిలిచిపోయేలా ఉందే!
ఇండస్ట్రీలోకి నెపోటిజం వల్ల అడుగు పెట్టారు వీరందరూ. కానీ, వీరు ఇంకా టాలీవుడ్ లో దిగ్గజ నటులుగా కొనసాగటానికి ఆ నెపోటిజం కారణం కాదు. వారు తమ తమ బలాలను పరిశీలించుకుని, తమ నైపుణ్యం పై పట్టు సాధించి, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని, వారి కెరీర్ ను వారే రూపుదిద్దుకుని, వారి రాకకు అర్థముంది అని నిరూపించారు.
ఒకపక్క, బాలీవుడ్ లో కూడా నెపోటిజం తారా స్థాయిలో ఉన్నప్పటికీ, టాలీవుడ్ కు ఉన్నంత విభిన్నత, ప్రతిభ, ప్రజ్ఞ అక్కడ లేవు అనడంలో సంకోచమే లేదు. ప్రత్యేకంగా టాలీవుడ్ కు నెపోటిజం వల్ల ఏ ఇబ్బంది లేకపోగా, ఇండస్ట్రీ గర్వపడే నటులను అందించింది. ఆఖరికి, టాలీవడ్ ‘నెపో కిడ్ల నైపుణ్యానికి’ పాన్ ఇండియా కూడా జైకొట్టక తప్పలేదు.
Also Read – ఈసారి కూడా హాట్ ఫేవరేట్స్ అవేనా.?
బాహుబలితో ప్రభాస్, పుష్ప తో అల్లు అర్జున్, RRR , దేవరతో రామ్ చరణ్, ఎన్టీఆర్, అఖండతో బాలకృష్ణ, పాన్ ఇండియా స్థాయిలో విజయాలను అందుకుని యాక్టింగ్లో తమ నాణ్యమైన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు.