యుఎస్ రాకెట్ – ‘విక్టిమ్-ఏ’గా తెలుగు హీరోయిన్?

tollywood-prostituition-busted-in-chicagoతెలుగు చిత్ర పరిశ్రమలో తాజా సంచలనంగా నిలిచి చర్చనీయాంశమైన ‘అమెరికాలో తెలుగు నటీమణుల సెక్స్ స్కామ్’లో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వర్ధమాన తారలను, ఓ వెలుగు వెలుగుతున్న వారిని విజిటింగ్ వీసాలపై అమెరికాకు పిలిపించి, పలు ప్రాంతాల్లో ఉంచి వారితో వ్యభిచారం చేయించిన కేసులో మోదుగుమూడి కిషన్, ఆయన భార్య చంద్రలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఆగడాలపై చికాగో కోర్టులో 42 పేజీల చార్జ్ షీట్ కూడా దాఖలైంది.

ఇక అతని పిలుపు మేరకు డిసెంబర్ 2017లో అమెరికాకు వెళ్లి వచ్చిన ఓ నటి, ఆపై కిషన్ ను వేడుకుంటూ ఓ ఈమెయిల్ రాయగా, దాన్ని చూసిన పోలీసులు, సదరు తెలుగు హీరోయిన్ ను ‘విక్టిమ్ – ఏ’గా చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఆమె తన ఈ-మెయిల్ లేఖలో… దయచేసి తనకు ఇక ఫోన్ చేయవద్దని, కాంటాక్ట్ కూడా చేయడానికి ప్రయత్నించవద్దని, మీతో కలసి ‘వ్యాపారం’ చేయడం తనకు ఇబ్బందిగా ఉందని వాపోయింది. మళ్లీ కాంటాక్ట్ చేస్తే తాను ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించింది.

ADVERTISEMENT

ఇక దీనికి బదులిచ్చిన కిషన్, పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆమెను, ఆమె కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ బెదిరింపు లేఖ తమ విచారణలో కీలకమైందని, దీనితో పాటు పలువురు తారలకు రాసిన ఈ-మెయిల్స్, కిషన్ భార్య చంద్ర సెల్ ఫోన్ లోని టెక్ట్స్ మెసేజ్ లు తమకు లభించాయని చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. కిషన్ భార్య చంద్రకళ హీరోయిన్ల రాకపోకలపై ఓ డైరీ రాసిందని, అందులో ఎవరు ఎప్పుడు వచ్చి ఎక్కడున్నారు? వారి దగ్గరకు ఎవరెవరు వచ్చారు? ఎంత ఇచ్చారు? తదితర వివరాలన్నీ రాసుకోగా, దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిజానికి ఈ కేసులో ఈ డైరీనే తమకు కీలక ఆధారమని తెలిపారు. ఈ డైరీలో ఓ ప్రముఖ తెలుగు నటి పేరుతో “వాషింగ్టన్ డీసీ – జనవరి 19 ఉదయం – రూమ్ నంబర్ 2018లో రెండు సార్లు, తరువాత రూమ్ నంబర్ 404లో ఒకసారి” అని రాసుంది. అలాగే హీరోయిన్ల కోసం బుక్ చేసిన విమానం టికెట్లు, హోటల్ రూముల తాలూకు బుకింగ్స్, వాళ్ల ఇంట్లో 70 కండోమ్ లు దొరికాయని స్పష్టం చేసారు. ఇక కిషన్ తప్పుడు సెక్యూరిటీ కార్డును సృష్టించాడని, అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.

పోలీసుల విచారణలో వెల్లడైన మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ హీరోయిన్లను అమెరికాకు రప్పించేందుకు వీసాలు ఇవ్వాలంటూ యూఎస్ కౌన్సెల్ జనరల్ కు ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్) సిఫార్సు చేసింది. ఆటాతో పాటు తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (టీఏఎస్) కూడా వీరికి సిఫార్సులు చేసింది. టీఏఎస్ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో నవంబర్ 8, 2017న స్టార్ నైట్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కోసం వీసా తీసుకున్న ఓ హీరోయిన్ అమెరికాకు వచ్చి, ఈవెంట్ లో పాల్గొనకుండా, చికాగోకు వెళ్లి వ్యభిచారం చేసినట్టు పోలీసులు తమ చార్జ్ షీట్ లో వెల్లడించారు.

ADVERTISEMENT
Latest Stories