ఇండస్ట్రీలో సరికొత్త రెమ్యూనరేషన్ ట్రెండ్

Gold Buyers Back to Old Cash Habitబ్లాక్ మనీ ఎక్కువగా ఉండే ఇండస్ట్రీలలో సినిమా ఇండస్ట్రీ ప్రధానమైనది. చిన్న నుండి పెద్ద హీరోల వరకూ తమ రెమ్యూనరేషన్లు రెండు రకాలుగా తీసుకోవడం సహజం. కొంత ఎమౌంట్ వైట్ గా చెక్ లో…. మిగతాది క్యాష్ లో తీసుకుంటూ ఉంటారు. వైట్ లో తీసుకున్న ఎమౌంట్ కు మాత్రమే టాక్స్ కట్టడంతో వారికి డబ్బు బాగా మిగులుతుంది. అయితే ఈ మధ్య ఈ ట్రెండ్ బాగా కష్టం అయ్యింది. మోడీ ప్రభుత్వం వచ్చాకా నోట్ల రద్దు తరువాత బ్లాక్ లో తీసుకోవడానికి హీరోలు జంకుతున్నారట.

అలాగని టాక్స్ కూడా కట్టడానికి ఇష్టం పడటం లేదు.కొందరు రియల్ ఎస్టేట్ అసెట్స్ లో తీసుకునే వారు. బినామీల మీద ప్రభుత్వం డేగ కన్ను వెయ్యడంతో అది కూడా ఇప్పుడు కుదరడం లేదట. దీనితో వారు ట్రెండ్ మార్చారు. బంగారం, వెండి రూపంలో రెమ్యూనరేషన్ తీసుకోవడం మొదలుపెట్టారట. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధర చుక్కలను తాకుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ లోహాల రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పట్లో తగ్గే అవకాశం కూడా లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

ADVERTISEMENT

ఈ క్రమంలో గోల్డ్ రూపంలో తమ పారితోష్కం ఇవ్వమని నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారట. ఇటీవలే ఒక నిర్మాత ఒక యంగ్ హీరోకు కోటి రూపాయిలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ముందు 70 లక్షలు ఇచ్చారట. దుబ్బింగ్ కు ముందు మిగతా 30 లక్షలు ఇవ్వాలని అగ్రిమెంట్. 30 లక్షలు గోల్డ్ లో ఇవ్వమని ముందే డిమాండ్ చేశారట. అయితే అతనికి ఒప్పుకున్న వెయిట్ లో గోల్డ్ ఇవ్వడానికి ఇప్పుడు నిర్మాతకు బంగారం రేటు పెరగడంతో ఐదు లక్షలు ఎక్కువ అయ్యిందట. అయినా సదరు హీరో తనకు గోల్డ్ లోనే కావాలి అనడంతో నిర్మాతకు తిప్పలు తప్పలేదు.

ADVERTISEMENT
Latest Stories