srikanth-odela-chandu-mondeti-prashanth-varma-sujeeth

ఒకప్పుడు సినీ పరిశ్రమ అంటే తొలత గుర్తుకువచ్చేది కథానాయకులు. సినిమా తీసారని పేరుకే గాని, దర్శకుని ప్రస్తావన పెద్దగా ఉండేది కాదు. అయితే, అలాంటి రోజుల నుండి కేవలం దర్శకుని ముద్ర చూసి ప్రేక్షకులు థియేటర్లకు పరిగెడుతున్న ఈ రోజుకి రావటానికి ఎందరో దర్శకులు నాంది పలకగా, మరెందరో దర్శకులు దాన్ని ప్రభావితం చేసారు.

Also Read – టీడీపీకి ఇలాంటి రాజకీయాలు అవసరమా?

తెలుగు సినిమాని దేశం మొత్తమే కాదు, తెలుగు సినిమాని అంతర్జాతీయ స్టేజి పై నిలబెట్టిన ‘రాజమౌళి’ తోనే ఆ ప్రస్తావన మొదలుపెట్టాలి. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, సందీప్ వంగా, నాగ్ అశ్విన్, లోకేష్ కనగరాజ్ వంటి వారు తమ తమ ఇండస్ట్రీలలోనే కాక, పొరుగు ఇండస్ట్రీల మెప్పును పొంది దర్శకుని ప్రాముఖ్యతను పెంచి అగ్ర దర్శకులుగా మారారు.

అయితే, కంటెంట్ లోనూ కథ లోనూ, తామెక్కడా తగ్గేదే లేదంటూ నేటి కుర్ర దర్శకులు సైతం ఎక్కడా వెనుకాడటం లేదు. మంచి కథ, చక్కని కథనం మరియు ప్రేక్షకులకు హై ఇచ్చే ఎలివేషన్లు ఇవ్వడంలో ఈ కుర్ర దర్శకులను ఎక్కడా తక్కువ చేయలేము. వారికి కథ పై ఉన్న నమ్మకం తో భారీ బడ్జెట్ అవుతున్నా, నిర్మాతలు కూడా వెనకడుగు వెయ్యట్లేదు.

Also Read – జగన్‌ దెబ్బకి రేషన్ బియ్యం నిలిచిపోయేలా ఉందే!

ఈ వరుస లో మొదట వినపడే పేరు ‘ప్రశాంత్ వర్మ’. హనుమాన్ అంటూ ఒక సూపర్-హీరో జోనర్ చిత్రాన్ని అబ్బురపరిచేలా తెరకెక్కించి అభిమానుల ఆశీస్సులు పొందాడు. దీనితో ఏకంగా బాలకృష్ణ తనయుడు నందమూరి వారసుడిని వెండి తెరకు పరిచయం చేసే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు.

ఇక, కార్తికేయ తో ఒక విభిన్నమైన కథను చెప్పిన ‘చందూ మొండేటి’, కార్తికేయ-2 తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ పేరు మార్మోగింది. ప్రస్తుతం నాగచైతన్య తో ‘తండేల్’ అంటూ వచ్చే ఏడు మన ముందుకు రానున్నారు.

Also Read – హైడ్రా ముగిసిన అధ్యాయమేనా.?

పుష్ప తో పాన్ ఇండియా దర్శకుల వరుసలో ఉన్న ‘సుకుమార్’ గారి శిష్యులంటే, వారి సినిమాలెలా ఉంటాయో అని 2023 సంవత్సరం చూపించింది. దసరా తో ‘శ్రీకాంత్ ఓదెల’, విరూపాక్ష తో ‘కార్తీక్ వర్మ దండు’ బాక్స్ ఆఫీస్ వద్ద డెబ్యూ సినిమాతోనే కాసుల పంట పండించారు. డెబ్యూ సినిమా తో నే వంద కోట్ల కలెక్షన్లు సొంతం చేసుకున్నారు వీరిద్దరు.

2014 లో రన్ రాజా రన్ అంటూ టాలీవుడ్ లో హీరో శర్వా తో కలిసి ప్రయాణించిన సుజిత్ తన రెండో సినిమాతోనే పాన్ ఇండియా స్టార్, టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకుని సాహో తో తన సత్తా చాటారు. ఇప్పుడు మూడో సినిమాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో OG అంటూ పవన్ అభిమానులతో పాటుగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను ఉరిస్తున్నారు సుజిత్.

అయితే,యాక్షన్ సినిమాల హవా నడుస్తున్న ఈ రోజుల్లో ‘హాయ్ నాన్న’ అంటూ డెబ్యూ చేసి అందరిని మెప్పించారు ‘శౌర్యువ్’. తన ఫామిలీ కథలతో ప్రేక్షకులనెప్పుడు సంతృప్తి పరిచే మరో దర్శకుడు ‘వెంకీ అట్లూరి’. తొలిప్రేమతో భారీ విజయాన్ని అందుకున్న ఈ కుర్ర దర్శకుడు ఇప్పుడు లక్కీ భాస్కర్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.




ఇలా చెప్పుకుంటూ పోతే, టాలీవుడ్ లో ఎందరో దర్శకులు ఔరా అనిపించే కథతో సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో మెప్పిస్తూ తెలుగు సినిమా భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తున్నారు. దీనితో ఆ దిగ్గజ దర్శకులకు వీరే వారసులులా మారనున్నారా అనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల నుండి వినపడుతుంది.