టాలీవుడ్ భయపడుతోందా.? బయటకొస్తుందా.?

tollywood-silence-on-allu-arjun-arrest

‘అల్లు అర్జున్ అరెస్ట్’…ఈ వార్త మీద ఒక్కొక్కరు ఒక్కోలా తమ స్పందన తెలియ చేస్తున్నారు. ప్రభుత్వమేమో చట్టం తన పని తానూ చేసుకుపోతుంది అంటున్నారు, ప్రతిపక్షాలేమో ఈ అరెస్టును ఖండిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఇక ఈ వార్త చుట్టూ ఉన్న ఊహాగానాలను, వాస్తవాలను ప్రజలకు చేరువ చేసే పనిలో మీడియా తన హడావుడి అది చేస్తుంది.

ఇక ఈ అరెస్టుతో ఎక్కువగా ప్రభావితం అయ్యే తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం ప్రస్తుతానికి మౌనంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తుంది. అయితే టాలీవుడ్ తన మౌనాన్ని వీడి ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ బయటకొచ్చి తమ గళం వినిపిస్తుందా.? లేక వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వంచినట్టు ఇప్పుడు కూడా తలవంచి భయపెడుతుందా.? అనేది తెలియాలి.

ADVERTISEMENT

నేడు తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి కానీ తెలుగు హీరోల క్రెజ్ కానీ పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ కు పాకింది. ఇటువంటి శుభ సమయంలో టాలీవుడ్ నుంచి ఉన్న పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ది పుష్ప అరెస్టయ్యి జైలుకు వెళుతున్నాడు అనేది టాలీవుడ్ కు ఒక చెరపలేని మచ్చగా మిగిలిపోతుంది. అలాగే ఇది అల్లు బ్రాండ్ కు కూడా ఒక చీకటి రోజుగా మారుతుంది.

అయితే ఇప్పటి వరకు ఈ అరెస్టు పట్ల సినీ పరిశ్రమ నుంచి ఏవిధమైన స్పందన రాలేదు. అల్లు అర్జున్ అరెస్టు ను ఖండిస్తూ అటు ఇండస్ట్రీ నుంచి అల్లు కుటుంబానికి మద్దతుగా ఒక్కరు కూడా ఒక్క ప్రకటన ఇవ్వలేదు, అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క విమర్శ చెయ్యలేదు.

ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్లడంతో ఇక ఇక్కడ నుంచి పరిణామాలు ఎలా మారబోతున్నాయి అనేది చర్చనీయాంశమయ్యాయి. బన్నీ ఏపీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలియచేసిన సందర్భం నుండి మెగా vs అల్లు గా సాగుతున్న పోరు నేపథ్యంలో చిరు బన్నీ ఇంటికి వెళ్లడం ఆసక్తి కరంగా మారింది.

అయితే ఈ సోషల్ మీడియా ఫ్యాన్ వార్ లన్ని కూడా కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అని మెగా స్టార్ చిరు నిరూపించారు. అయితే ఇప్పటికే N కన్వెన్షన్ కూల్చివేతతో సినీ ఇండస్ట్రీ నుంచి హీరో నాగార్జున తో వైరం పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం,అక్కడితో ఆగకుండా ఆయన కుమారుడు నాగ చైతన్య, మాజీ కోడలు సమంత విడాకుల విషయంలో కూడా మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

దీనితో ఈ వ్యాఖ్యలను టాలీవుడ్ ప్రముఖులు ముక్త ఖంఠంతో ఖండించారు. అయితే నాగార్జున కుటుంబ విషయంలో ఇక తాటి మీదకు వచ్చి ప్రభుత్వ పెద్దల విచక్షణను నిలదీసిన టాలీవుడ్ ఇప్పుడు అల్లు కుటుంబానికి మద్దతు పలకడానికి ముందుకు వస్తుందా.? వచ్చి ప్రభుత్వం తీసుకున్న ఈ దూకుడు చర్యలను ప్రశ్నించగలుగుతుందా.?

ADVERTISEMENT
Latest Stories