అన్ని బాషల్లో భారీ పోటీ…ఫలితం ఏమవుతుందో??

Too much competition to KGF movie in Tollywood and bollywoodకన్నడ సినిమా పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం యువ హీరో యష్ నటించిన “కేజీఎఫ్”. అయితే ఈ సినిమా కన్నడంతో పాటు, తెలుగు, తమిళం, మళయాళం, హిందీలో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై అన్ని బాషల్లో భారీ అంచనాలే ఉన్నాయి…

[m9ad]

ADVERTISEMENT

ఆ క్రమంలోనే ప్రతీ బాషలో ఈ సినిమాకు భారీ పోటీ నెలకొంది. ఈ నెల 21 అంటే, ఈ వారాంతరం విడుదల అవనున్న ఈ సినిమాకి ఇటు తెలుగులో శర్వానంద్ నటించిన పడి పడి లేచే మనసు… తెలుగులో వరుణ్ నటించిన తొలి స్పేస్ సినిమా ‘అంతరిక్షం’ పోటీగా విడుదల అవుతూ ఉండగా…మరో పక్క హిందీలో ఏకంగా షారూఖ్ ఖాన్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జీరో’ పోటీలో ఉంది. ఇక తమిళ భాషకు వచ్చేసరికి ఈ సినిమా ధనుష్ నిర్మాతగా, సాయిపాల్లవితో కలసి నటించిన మారి-2తో పోటీ పడనుంది.

మొత్తంగా చూసుకుంటే భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్దం అవుతున్న ఈ సినిమా, మరో పక్క ప్రతీ పరిశ్రమలో భారీ సినిమాల మధ్య విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో? యష్ ను ఏ స్థాయిలో నిలుపుతుందో చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories