హాట్ బ్యూటీ ట్రైలర్ రిలీజ్!

Karenjit Kaur - The Untold Story of Sunny Leone-బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ జీవిత కథతో ‘కరణ్ జీత్ కౌర్: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్’ పేరిట ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. దీన్ని ఒక సినిమాలా కాకుండా, వెబ్ సిరీస్ లా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో సన్నీ పాత్రలో రైసా సౌజానీ అనే అమ్మాయి నటించింది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు.

ADVERTISEMENT

సన్నీకి మేకప్ వేస్తున్న సన్నివేశంతో ట్రైలర్ మొదలవుతుంది. అనంతరం చిన్నతనంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టడం, ఫొటో షూట్లు, తల్లిదండ్రులు తిట్టడం, ఇంటర్వ్యూలో సన్నీని అసభ్యకర ప్రశ్నలు అడిగిన సన్నివేశాలను చూపించారు. ఈనెల 16న ఓ ఆంగ్ల ఛానల్ లో ఈ సిరీస్ ప్రసారం కానుంది.

ADVERTISEMENT
Latest Stories