బిగ్ బాస్ హౌస్ కు లీకుల బెడద

transgender tamanna elimination bigg boss 3 teluguబిగ్ బాస్ మూడో సీజన్ విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఈ వారం తమన్నా, బాబా భాస్కర్, రాహుల్, పునర్నవి, వితికా నామినేషన్స్ లో ఉన్నారు. అయితే తమన్నా ఈ వారం ఎలిమినేట్ అవుతుందని సమాచారం. వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన తమన్నా ఇంట్లోకి ప్రవేశించిన నాటి నుండి అందరికి తగవులు పెడుతుంది. ఒకరిద్దరి మీద చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేసి, ఆడియన్స్ దృష్టిలో పడింది. దీనితో ఆమె ఎలిమినేట్ అయితే అదేమీ ఆశ్చర్యకరం కాదు.

ADVERTISEMENT

ఇది ఇలా ఉండగా గత వారం బిగ్ బాస్ హౌస్ నుండి టీవీ9 జఫ్ఫార్ ఎలిమినేట్ అయ్యారు. అప్పుడు కూడా ముందే ఆయన అవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తమన్నా విషయం కూడా లీక్ అయితే, షో నిర్వాహకులకు ఇబ్బందే. ఇలా ఎలిమినేట్ అయ్యేవారి పేర్లు ముందే లీక్ అయితే షో మీద ఇంట్రస్ట్ పోతుంది. దీనితో ఈ విషయంలో షో నిర్వాహకులు ఏం చెయ్యబోతున్నారు అనేది చూడాలి. షో నుండి ఇప్పటికే హేమ, జఫ్ఫార్ ఎలిమినేట్ అయ్యారు.

తమన్నా వైల్డ్ కార్డుగా వచ్చినా ఈరోజు ఎలిమినేట్ అయితే ఉపయోగం లేనట్టే. మరోవైపు బాబా భాస్కర్ కూడా ఈ గేమ్ రిస్క్ లో ఉంటున్నారు. నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లలో బాబా భాస్కర్‌కు భారీ స్థాయిలో ఓట్లు పడుతున్నాయని ఓ వార్త బయటకు వచ్చింది. ఆయన ఈటీవీలో ప్రసారమైన డీ డాన్స్ షోతో బాగా ఫేమస్ అయ్యారు. తెలుగు షోలో తమిళ సెలెబ్రిటీని తీసుకోవడం పట్ల ‘బిగ్ బాస్’ నిర్వహకులపై విమర్శలు వచ్చిన విషయంగా ఆయనకు ఎలిమినేషన్ లో ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అయితే తమన్నా ఆయనను సేవ్ చేసింది అనుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories