ఇదివరకు తమిళనాడు దివంగత సిఎం జయలలిత స్నేహితురాలిగా శశికళ తమిళ రాజకీయాలను శాశిస్తుండేవారు. ఇప్పుడు విజయ్ సిఎం అయినప్పటి నుంచి ఆయన ప్రియసఖి త్రిష పేరు పదేపదే వినిపిస్తోంది.
త్రిష రాజకీయాలలో జోక్యం చేసుకోనప్పటికీ, సిఎం విజయ్‌తో ఉన్న అనుబంధం కారణంగా ప్రతిపక్ష పార్టీలు ఆమె పేరుని ప్రస్తావిస్తూ విజయ్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నాయి.
ఇటీవల ఓ సభలో డీఎంకే ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత ఉదయనిధి స్టాలిన్ ఆమెని ఉద్దేశ్యించి ఓ డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టారు. అందుకు పోలీసులు ఆయనని అరెస్ట్ చేయడంతో తమిళ రాజకీయాలలో త్రిష పేరు మారుమ్రోగింది.
తాజాగా అన్నాడీఎంకే నేత ఒకరు ‘కావేరీ నది జల సమస్యల కంటే ‘వదిన గారిని’ డెప్యూటీ సిఎం చేయడమే ముఖ్యమన్నట్లు ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోందంటూ,’ వ్యంగ్యంగా అన్నారు. ఈవిధంగా తమిళ రాజకీయాలలో త్రిష పేరు వినిపిస్తూనే ఉంది.
అయితే ఒంటి చేత్తో చప్పట్లు మోగవు కనుక ఆమె కూడా చేతులు కలుపుతున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మెసేజ్‌లు పెట్టారు.
“ఈ వయసులో ఇలాంటి ఇబ్బందికరమైన డ్రామాలు అవసరమా? వెళ్ళి కాస్త డబ్బు సంపాదించుకొని ప్రశాంతంగా జీవించు,”అని ఒక మెసేజ్ పెట్టారు. తర్వాత “ఇదివరకు మీరు ప్రార్ధించిన దాని కంటే ఇప్పుడు జీవితం గొప్పగా మారింది కదా?”అని మరో మెసేజ్ పెట్టారు.
అయితే ఆమె ఉదయనిధి పేరు ప్రస్తావించ లేదు కనుక ఒకవేళ అయన స్పందిస్తే అది గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లే అవుతుంది. కనుక మళ్ళీ తగిన సమయం వచ్చినప్పుడు స్పందించవచ్చు.
అయితే త్రిష ఆయన గురించే ఈ మెసేజ్‌లు పెట్టారా లేక సిఎం విజయ్ భార్య సంగీతని ఉద్దేశ్యించా?అనే చర్చ మొదలైంది.
ఇటీవల సంగీత విడాకుల పిటిషన్ వెనక్కు తీసుకున్నారు. కనుక భర్తతో కాపురం చేసేందుకు సిద్ధపడ్డారని భావించవచ్చు. ఒకవేళ సిఎం విజయ్ కూడా రాజీ పడి భార్యతో కలిసి జీవించాలనుకుంటే… ఇంత హడావుడి చేసినందుకు త్రిష నవ్వులపాలవుతారు. ఆమె జీవితం తలక్రిందులవుతుంది.
కనుక ఆ దుగ్ధతోనే ఆమె సిఎం విజయ్ భార్య సంగీతని ఉద్దేశ్యించి ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. కనుక ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు, ఒక్క మెసేజ్‌తో ఇద్దరూ భుజాలు తడుముకునేలా చేశారు.
కానీ తమిళ రాజకీయాలలో ఈవిధంగా ఆమె పేరు నానుతుండటం గొప్పగానే అనిపించవచ్చు. కానీ ఇది ఆమెకు, సిఎం విజయ్‌కి ఎప్పటికీ ఇబ్బందికరమే.



