యువ హీరో నితిన్, సమంత జంటగా ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా “అఆ” (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇటీవల విడుదలైన టైటిల్ ఆవిష్కరణ పోస్టర్ కు మంచి స్పందన రావడంతో, ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి.
తాజాగా విడుదలైన పోస్టర్ నితిన్ ‘ఇష్క్’ సినిమాను గుర్తుకు తెస్తోంది. పూర్తి ప్రేమకధా చిత్రంగా తెరకెక్కిన ‘ఇష్క్’ సినిమాలో ఓ పాటలో హీరో నితిన్, హీరోయిన్ నిత్యామీనన్ లు కూడా ఇలాంటి లొకేషన్ లో దాదాపుగా ఇవే కాస్ట్యూమ్స్ తో సందడి చేసారు. దీంతో ఈ పోస్టర్ చూడగానే సహజంగానే గత సినిమా గుర్తుకు వస్తుంది. అయితే ఆ సినిమా స్థాయిలోనే ఈ సినిమా కూడా సందడి చేస్తే అంతకంటే సినీ ప్రేక్షకులు ఏం కోరుకుంటారు!
‘వాలైంటైన్స్ డే’ శుభాకాంక్షలు చెప్తూ కాస్త లేటుగా విడుదలైన ఈ సినిమా కూడా పూర్తి స్థాయి ప్రేమకథ అని చెప్పకనే చెబుతోంది. మరి ఈ లవ్ స్టొరీని మాటల మాంత్రికుడు తన మాటలతో ఎలా బంధించాడో తెలుసుకోవాలంటే ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే!



