గురూజీ ఇది నిజమేనా?

Back-To-Back-‘Mega’-Movies-For-Trivikram-Srinivasమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరో తప్పు చేస్తున్నాడు అంటూ టాలీవుడ్ లో ఒక వార్త చక్కెట్లు కొడుతోంది. అయితే అసలు ఇంతకీ ఆ వార్త ఏంటి అంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలెంటెడ్ దర్శకుడు, కానీ ఈ మధ్య ఆయన పెన్ లో ఇంకు అయిపోయినట్లుగా ఉంటున్నాయి ఆయన సినిమాలు.

అజ్ఞాతవాసి గురించి మనం మాట్లాడుకోపోవడమే కరెక్ట్, ఇక ఆ తర్వాత వచ్చిన అరవింద సమేత కూడా హిట్ అనిపించుకుంది కానీ, పెద్దగా ఆకట్టుకునే సినిమాగా మాత్రం నిలవలేదు. సరే అదంతా పక్కన పెట్టేస్తే నితిన్ అ..ఆ సినిమా విషయంలో ఒక ప్రముఖ నవలను ఆధారం ఆ కదా ఉంది అని, ఆ నవలా రచయితకు క్రెడిట్స్ ఇవ్వలేదు అని రభస జరిగింది.

ADVERTISEMENT

ఇక తర్వాత అజ్ఞాతవాసి సినిమా విషయంలో ఈ సినిమా వేరే భాష నుంచి తీసుకున్న కధగా తెలిసి త్రివిక్రమ్ కూడా కాపీ కొడతాడా అన్న ఆలోచన అందరిలో మొదలు అయ్యింది. ఇదిగో ఇప్పుడు అల్లు అర్జున్ తో తానూ తీసున్న తాజా సినిమా కూడా ఒక ఇంగ్లీష్ సినిమాను ఆధారంగా చేసుకునే తెరకెక్కిస్తున్నాడని టాలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరి అది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ..అదే నిజం అయితే మాత్రం గురూజీ అదే తప్పు మళ్ళీ చేస్తున్నట్లే.

ADVERTISEMENT
Latest Stories