త్రివిక్రమ్ డిస్కవరీలో తారక్ మరో యాంగిల్!

trivikram-srinivas-jr-ntr-anu-emmanuelప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హవా నడుస్తున్నట్లుగా కనపడుతోంది. తారక్ ఏం చేసినా, ఏం పట్టుకున్నా అదే బంగారమే అవుతోంది. అసలు క్రేజ్ లేనటువంటి దర్శకుడు బాబీతో చేస్తున్న “జై లవకుశ” సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసిన తారక్, మరో వైపు బుల్లితెరను కూడా ఏకచ్చాత్రాధిపత్యంగా ఏలుతున్నాడు. ఇలా తనలో ఉన్న అన్ని యాంగిల్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న ‘బుడ్డోడు’ త్వరలో తనలోని కామెడీ యాంగిల్ ను కూడా చూపించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం తారక్ నటిస్తున్న “జై లవకుశ” సినిమా సెప్టెంబర్ 21వ తేదీన విడుదలకు సిద్ధమవుతుండగా, తదుపరి సినిమాకు ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా వెంటనే చేసేందుకు స్కెచ్ సిద్ధం చేసారట. కాస్త గెటప్ చేంజ్ చేసుకునే విధంగా అక్టోబర్ మాసం మొత్తం విశ్రాంతి తీసుకుని, నవంబర్ లో త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి ప్లానింగ్ చేసుకున్నట్లుగా సమాచారం. నవంబర్ రెండవ వారం నుండి ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు ఇప్పటికే సర్వం సన్నద్ధమయ్యాయని టాక్.

ADVERTISEMENT

హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో జూనియర్ సరసన అను ఇమ్మానుయేలు హీరోయిన్ గా నటించనుండగా, అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాతో మరో వైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ బిజీగా ఉండడంతో, సదరు సంగతులన్నీ అధికారికంగా డిక్లేర్ చేయలేదు. అక్టోబర్ చివరి నాటికి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పూర్తి కానుండడంతో, ఈ సినిమా నవంబర్ రెండవ వారం నుండి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ చేత మాటల మాంత్రికుడు ఏ విధంగా గిలిగింతలు పెట్టిస్తాడోనని యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories