ట్రంప్‌కి పోప్ వేషం సూట్ అవదేమో?

Trump Peace Claims

ట్రంప్‌ దొరగారు హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ఆపేశానన్నారు. కానీ ఇజ్రాయెల్ వాయుసేన మళ్ళీ గాజాలోని హామాస్ స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడిలో 24 మంది పాలస్తీనీయులు చనిపోయారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. మళ్ళీ యుద్ధం తప్పదని హెచ్చరించారు. కనుక నేడో రేపో వాళ్ళు కూడా మళ్ళీ మొదలుపెట్టవచ్చు.

ఇక రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కూడా ఆపెశానని ట్రంప్‌ దొరగారు చెప్పారు. సినిమాలో ఇంటర్వెల్లా కాస్త ఆగింది. కానీ ట్రంప్‌ శాంతి ప్రవచనాలు పుతిన్‌-జెలెన్ స్కీ ఇద్దరికీ నచ్చడం లేదు. కనుక ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఉండవచ్చు.

ADVERTISEMENT

భారత్‌-పాక్‌ యుద్ధం చిటిక వేసి ఆపేశానన్నారు. కానీ ఢిల్లీ కారు బాంబు ప్రేలుడు తర్వాత గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు పాకిస్తాన్‌ హడావుడిగా సైన్యాన్ని అలర్ట్ చేసింది. అంటే ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందని పాకిస్తాన్‌ గట్టిగా నమ్ముతోందన్న మాట!

ఈ యుద్ధాలను ఆపడం ట్రంప్‌ వల్ల కూడా కాదని అన్ని దేశాలకు తెలుసు. కానీ ఆంక్షలు, వీసాల కోసం అన్ని దేశాలు తెలియనట్లు నటించాయి. నోబుల్ శాంతి బహుమతి కమిటీకి కూడా తెలిసే ఉంటుంది. అందుకే ఇవ్వలేదేమో?

ఏఐ సాయంతో పోప్ వేషంలో ట్రంప్‌ ఫోటో పెట్టుకుని తాను శాంతి కామకుడిని అని ప్రపంచాన్ని నమ్మించాలనుకున్నారు. కానీ యుద్ధ నివారణ పేరుతో ట్రంప్‌ ఆయుధాల వ్యాపారం చేస్తూ అమెరికాకు బాగానే ఆదాయం సమకూర్చుతున్నారు కదా? కనుక ట్రంప్‌కి పోప్ వేషం సూట్ అవదేమో?

అమెరికాని పాలించడానికే ప్రజలు తనను ఈ కుర్చీలో కూర్చోబెట్టారని గ్రహించి, ఆ పని మీద ఉంటే మూడేళ్ళ తర్వాత సగౌరవంగా దిగిపోవచ్చు. కానీ ఇలాంటి ఏఐ వేషాలు వేస్తుంటే అమెరికా చరిత్రలో తప్పుగా నమోదవుతుంది కదా?

ADVERTISEMENT
Latest Stories