
ఇవాళ్ళ అదివారం ఇంచుమించు ఒకే సమయంలో రెండు ఆసక్తికరమైన వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి.
ఒకటి..హిల్టన్ హోటల్లో ట్రంప్‌తో సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, వందల మంది అతిధులు పాల్గొంటున్న వైట్‌హౌస్ కరస్పాండెంకట్స్ డిన్నర్ మీటింగ్‌లో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపినప్పుడు, భద్రతా సిబ్బంది ట్రంప్‌తో సహా ప్రముఖులను అక్కడి నుంచి భద్రంగా బయటకు తరలిస్తున్న వీడియో.
రెండోది… నేడు జగన్ దంపతులు శనివారం రాత్రి బెంగళూరు నుంచి యూరప్ పర్యటనకు బయలుదేరుతున్నప్పుడు, విమానాశ్రయంలో సుమారు రెండు డజన్ల మంది భద్రతా సిబ్బంది వారికి రక్షణగా లోనికి తోడ్కొని తీసుకువెళుతున్నప్పుడు తీసిన వీడియో.
ట్రంప్ అంటే ఈ ప్రపంచాధి నేత అనుకోవచ్చు. కాదంటే అయన ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళకుండా ఆపగలిగేది ఈ ప్రపంచం.
అలాంటి వీవీవీఐపీతో పాటు అమెరికా రక్షణ, విదేశాంగశాఖల మంత్రులు, డజన్ల కొద్దీ వీవీవీఐపీలు లోపల ఉన్నప్పుడు చీమ కూడా లోనికి చొరబడలేదు… అని జనం అనుకుంటారు. కానీ ఓ వ్యక్తి తుపాకీతో జొరపడి కాల్పులు కూడా జరిపాడు.
దాంతో ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియాతో అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సమావేశం మద్యలో పారిపోవాల్సి వచ్చింది.
కానీ జగన్ దరిదాపులకు చీమ కూడా చేరకుండా భారీ భద్రతతో విమానం ఎక్కించారు మన భద్రతా సిబ్బంది.
Ever since the most anticipated trailer of Rajinikanth's Jailer 2 directed by Nelson Dilipkumar, was…
AP Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan held a key…